దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3 లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. తాజాగా ఆదివారం రోజు ఓట్లను లెక్కించారు. ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. త్రిపురలో అగర్తల, జుబరాజ్ నగర్, సుర్మా, బర్డోవాలి( పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గాలకు, జార్ఖండ్ లోని మందార్, ఢిల్లీలోని రాజిందర్ నగర్, ఏపీలోని ఆత్మకూర్ అసెంబ్లీ నియోజవర్గాలతో పాటు పంజాబ్ లోని సంగ్రూర్ లోక్ సభ, ఉత్తర్…
సాధారణంగా ప్రభుత్వ పథకాల పనులంటేనే నాసిరకంగా ఉంటాయనేది ప్రజల నమ్మకం. కాంట్రాక్టర్లు తమ కక్కుర్తితో భవనాలను, రోడ్లను నాసిరకంగా నిర్మిస్తుంటారు. అయితే చేయి వేస్తే కూలిపోయేంత నాసిరకంగా మాత్రం భవనాలు నిర్మించడం చాలా అరుదు. ఇప్పుడు ఇలాంటి ఓ ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అది కూడా అలాంటి ఇలాంటి భవనం కాదు.. రూ.100 కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న ఓ ఇంజనీరింగ్ కాలేజ్ భవనం. నాణ్యత పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే చేయి వేయగానే భవనం గోడలు…
అప్పుడప్పుడు మ్యాన్‌హోల్స్‌లో వాహనాలు పడిపోవడం, మనుషులు మునిగిపోవడం లాంటి సంఘటనలు వెలుగుచూడటాన్ని మనం చూశాం. ఇలాంటివి ఎన్ని జరిగినా, ప్రభుత్వాలు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘోర ప్రమాదమే చోటు చేసుకుంది. ఏకంగా ఓ జంట నీటి గుంతలో పడిపోయింది. అదృష్టవశాత్తూ చుట్టుపక్కలున్న వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అలీఘఢ్‌లోని కిషన్పూర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు నీటితో నిండిపోయాయి. ఈ…
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన’అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోనే కాకుండా..పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ లో నిరసనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. యూపీలోని బల్లియాలో నేటి ఉదయం కొంతమంది నిరసనకారులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి పట్టాలపై ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. స్టేషన్‌లోని ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే రైళ్లలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.…
ఇటీవల నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత యూపీతో పాటు దేశ వ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్, ప్రయాగ్ రాజ్, హత్రాస్, సహరాన్ పూర్ ఏరియాల్లో రాళ్ల దాడులు, ఆస్తుల విధ్వంసం జరిగింది. దీంతో అక్కడి యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కన్నెర్ర చేసింది. ఇప్పటికే 300కు పైగా నిందితులను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితులకు సంబంధించి వారి అక్రమ ఆస్తులను…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. పలు చోట్ల ముస్లింలు తమ నిరసనను తెలియజేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాళ్లు రువ్వడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాలను తగలబెట్టడం చేశారు. ముఖ్యంగా ఇటీవల యూపీ కాన్పూర్ లో రాళ్లదాడి చేయగా.. నిన్న ప్రయాగ్ రాజ్ లో కొంతమంది అల్లరి మూకలు రాళ్లదాడి చేశారు. దీంతో పాటు సహరాల్ పూర్ లో…
గత కొన్ని రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఇటీవల కాన్పూర్ లో హింస చెలరేగింది. కొంతమంది రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో 40 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం కాన్పూర్ లో అల్లర్లు తగ్గుముఖం పట్టాయి. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే బీజేేపీ పార్టీ నుపుర్ శర్మతో పాటు నవీన్…
భారత రాష్ట్రపతి పదవి అనేది ఎంతో కీలకం. దేశం మొత్తం పరిపాలన అంతా రాష్ట్రపతి పేరుమీదే కొనసాగుతుంది. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చింది. నిజానికి భారత ప్రభుత్వానికి అధిపతి రాష్ట్రపతే అయినా.. వాస్తవంగా అధికారం చెలాయించేది ప్రధాని సారథ్యంలోని మంత్రి మండలి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం రాష్ట్రపతికి విశేష అధికారాలను కల్పించింది భారత రాజ్యాంగం. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో భారత రాష్ట్రపతికి విశేష అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కూడా సాధారణం…
2020 లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోయారు. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో వలస కూలీలు కాలి నడకన లేదా సైకిళ్ల మీద సొంతూళ్లకు వెళ్లారు. యూపీలో కొందరు వలస కూలీలు తమ సైకిళ్లను సహరణ్ పూర్లో వదిలి వెళ్లారు. ఎందుకంటే సహరణ్ పూర్ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు మెయిన్ సెంటర్‌గా ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో కూలీలు భారీ ఎత్తున సైకిళ్లు వదిలివెళ్లారు.…
ఈమధ్య వింత వింత కారణాల వల్ల పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. బట్టతల ఉందనో, తాగుడు అలవాటు ఉందనో.. అమ్మాయిలు పీటల మీదే పెళ్లిళ్లను రద్దు చేసేసుకుంటున్నారు. అంతెందుకు.. మొన్నటికి మొన్న పూలమాల వేస్తున్నప్పుడు వరుడి చెయ్యి తన మెడకు తగిలిందన్న కారణంగా వధువు అప్పటికప్పుడే పెళ్లి రద్దు చేసుకొని, మండపం నుంచి బయటకు వెళ్లిపోయింది. తాజాగా ఓ వధువు కేవలం ఫోటోగ్రాఫర్ రాలేదన్న ఆగ్రహంతో.. పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..…