Father Try to Kill Own Daughter in Uttar Pradesh: లవ్ ఎఫైర్ పెట్టుకుందని సొంత కూతురినే తుదముట్టించేందుకు ప్రయత్నించాడో తండ్రి. కాంట్రాక్ట్ కిల్లర్ కు సుపారీ ఇచ్చి కూతురును హత్య చేయించేలా పథకం వేశాడు. అయితే చివరకు తండ్రితో పాటు కాంట్రాక్ట్ కిల్లర్ దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల మాట కాదని ఓ వ్యక్తిని ప్రేమిస్తూ.. అతనితో సంబంధం నెరుపుతోంది. అయితే తండ్రితో పాటు కుటుంబ సభ్యులు ఎంత కోరినా వినలేదు. దీంతో తండ్రి కూతురును చంపేందుకు ప్లాన్ వేశాడు. తన కూతురును చంపేందుకు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వార్డు బాయ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. లక్ష రూపాయాలతో ఒప్పందం కుదిరింది.
ఇటీవల ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాలికకు వార్డ్ బాయ్ ఎక్కువ మొత్తంలో పొటాషియం క్లోరైడ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో బాధితురాలి ఆరోగ్యం క్షీణించింది. బాలిక తండ్ర నవీన్ కుమార్, వార్డ్ బాయ్ నరేష్ కుమార్ తో పాటు.. ఓ మహిళా ఉద్యోగి హత్యా ప్రయత్నంలో నిందితులుగా ఉన్నారు. ఆరోగ్య కారణాలతో నవీన్ కుమార్ తన కూమార్తెను శుక్రవారం రాత్రి కంకరఖేడాలోని ఓ అస్పత్రిలో చేర్చాడు. అక్కడ నుంచి అమ్మాయిని మోడీపురం ఫ్యూచర్ ప్లస్ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత బాలిక ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అయితే మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తి గుర్తించి విచారించడంతో హత్య విషయం మొత్తం బయటపడింంది.
బాలిక తండ్రి కూతురును చంపేందుకు లక్ష రూపాయలు ఇచ్చాడని వార్డ్ బాయ్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. వైద్యుడిలా నటిస్తూ.. వార్డ్ బాయ్ ఐసీయూలోకి ప్రవేశించి బాలికకు అధిక మోతాదులో ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో బాలిక తండ్రిని, వార్డ్ బాయ్, హత్యోదంతానికి సహకరించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి నవీన్ కుమార్ ను పోలీసులు విచారించారు.. తన మాట వినకుండా ఓ వ్యక్తిని ప్రేమిస్తుందని అందుకే హత్య చేయాలని చూశానని వెల్లడించాడు. వార్డ్ బాయ్ దగ్గర నుంచి పొటాషియం క్లోరైడ్, రూ.90,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.