ఎడారిలో ఎటు చూసినా ఇసుక తప్పించి మరేమి కనిపించదు. ఒయాసిస్సులు ఉన్న చోట మాత్రమే చెట్లు కనిపిస్తాయి. ముళ్ల చెట్లు, నాగజెముడు, బ్రహ్మజెముడు వంటివి మాత్రమే కనిపిస్తుంటాయి. ఎవరూ కూడా కావాలని ఏరికోరి ఎడారి ప్రాంతాలకి పిక్నిక్‌లకు వెళ్లరు. కానీ, అమెరికాలోని ఫ్రీఫోర్డ్ అనే పట్టణానికి సమీపంలో మైనె డెజర్ట్ అనే ఎడారి ప్రాంతం ఉంటుంది. ఇది మిని ఎడారి అనుకోవాలి. ఇది సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది. అదేంటి ఎడారి అంటే వందల…
కరోనా మహమ్మారి మనుషుల మధ్య బంధాలను తెంచేస్తోంది. మనుషుల మానవత్వాన్ని చంపేస్తేన్నది. అమెరికాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. చిన్నారులు అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. అమెరికాలోని టెక్సాన్ కు చెందిన సారాబీమ్ అనే మహిళ డ్రైవ్ త్రూ టెస్టింగ్ కేంద్రానికి కారును తీసుకొని వచ్చారు. అలా వచ్చిన ఆ మహిళ కారు డిక్కిలో నుంచి మాటలు వినిపిస్తుండటంతో అక్కడ ఉన్న సిబ్బంది…
తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు డొనాల్డ్ ట్రంప్.. ఆయన అధ్యక్షుడు అయినా.. ఎప్పుడూ మీడియాపై ఎటాక్ చేస్తూ… సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటూ.. తన అభిప్రాయాలను పంచుకునేవారు.. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. సోషల్ మీడియా డొనాల్డ్ ట్రంప్‌పై నిషేధం విధించింది.. సోషల్ మీడియాలో ఆయన అన్ని ఖాతాలు, ఆయన ప్రధాన అనుచరుల ఖాతాలు కూడా బ్యాన్‌కు గురయ్యాయి.. అయితే,…
ప్రపంచకుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ చిక్కుల్లో పడింది. ఇటీవలే టెస్లా కంపెనీ చెందిన షోరూమ్‌ను చైనాలో లాంచ్ చేశారు. జిన్ జియాంగ్ ప్రావిన్స్‌లోని ఉరుమ్‌కిలోలో షోరూమ్‌ను ప్రారంభించారు. ఉరుమ్‌కిలోలో షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఎలన్ మస్క్ విబోలో ప్రకటించాడు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన పలు వాణిజ్య సంస్థలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎలన్ మస్క్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. Read: కోడి పందాలపై హైకోర్టులో పిటిషన్..…
అమెరికాలో కరోనా వీర విజృంభణ చేస్తున్నది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది డెల్టా వేరియంట్ సమయంలో ఒక్క రోజులో అత్యధికంగా 2 లక్షల వరకు కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆదివారం రోజున యూఎస్‌లో 5.90 లక్షల కోవిడ్ కేసులు నమోదవ్వగా దానికి డబుల్ స్థాయిలో మిలియన్ కరోనా కేసులు సోమవారం రోజున నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో సుమారు 4 లక్షల కేసులు…
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఒమిక్రాన్ రాకతో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది యూఎస్‌లో అత్యధిక సంఖ్యలో రెండు లక్షల వరకు కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది, ఆ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఒక్కరోజులో 4 నుంచి 5 లక్షల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో 30 నుంచి 40 శాతం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసుల పెరుగుదల కారణంగా ఆసుపత్రులపై…
ప్రపంచంలో నాలుగింట మూడొంతులు నీళ్లతో నిండిపోగా, ఒక వంతు మాత్రమే భూమి ఉన్నది. ఈ ఒక వంతు భూమిపై ప్రస్తుతం ఎంతమంది నివశిస్తున్నారు, సెకనుకు ఎంత మంది పుడుతున్నారు, ఎంత మంది మరణిస్తున్నారు అనే విషయాలను అమెరికాకు చెందిన సెన్సెస్ బ్యూరో ఓ నివేదిను తయారు చేసింది. 2021 లో ప్రపంచ జనాభా భారీగా పెరిగినట్టు అంచనా వేసింది. 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 786 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. 2021…
అమెరికాలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి 8 వ తేదీన 2.94 లక్షల కేసులు నమదవ్వగా దాదాపు దానికి రెండింతల కేసులు యూఎస్‌లో ఈ ఒక్కరోజులో నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. జాన్ హోప్కిన్స్ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 5.12 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి మొదలయ్యాక ఈ స్థాయిలో…
ప్రపంచంలో సమర్థవంతమైన, అత్యంత శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసేందుకు అగ్రరాజ్యాలు సిద్దమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీని బేస్ చేసుకొని స్వీయ నియంత్రిత కిల్లర్ రోబోట్స్‌ను తయారు చేసేందుకు చైనా, అమెరికా, రష్యా దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక రంగాల్లోకి రోబోలు ప్రవేశించాయి. అయితే, ఇప్పటి వరకు ప్రొగ్రామ్ ఆపరేటింగ్ లేదా రిమోట్ కంట్రోల్ తో పనిచేసే రోబోలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు స్వీయ నియంత్రిత రోబోలను అందుబాటులోకి రాబోతున్నాయి.…