డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు డొనాల్డ్ ట్రంప్.. ఆయన అధ్యక్షుడు అయినా.. ఎప్పుడూ మీడియాపై ఎటాక్ చేస్తూ… సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటూ.. తన అభిప్రాయాలను పంచుకునేవారు.. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. సోషల్ మీడియా డొనాల్డ్ ట్రంప్‌పై నిషేధం విధించింది.. సోషల్ మీడియాలో ఆయన అన్ని ఖాతాలు, ఆయన ప్రధాన అనుచరుల ఖాతాలు కూడా బ్యాన్‌కు గురయ్యాయి.. అయితే, ఇప్పుడు ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేశారు.. త్వరలో కొత్త సోషల్ మీడియా వేదికను ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు. ‘ట్రూత్ సోషల్’ అనే యాప్ ద్వారా మళ్లీ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.. ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన ఈ యాప్‌ను తీసుకురానున్నట్లు సమాచారం.
Read Also: జనవరి 8, శనివారం దినఫలాలు…
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
కాగా, అమెరికా పార్లమెంటు భవన సముదాయం కేపిటల్ హిల్‌పై దాడి ఘటనలో డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలిన నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.. అప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరమైన ట్రంప్.. ఇప్పుడు తానే కొత్తగా యాప్‌తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.. ది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) నేతృత్వంలో ట్రూత్ సోషల్ యాప్ పై కసరత్తు జరుగుతోంది.. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను పోలి ఉండేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు.. ఇందులోనూ ఒకరినొకరు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది.. ఇక, ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు తెలుసుకునే వీలుకూడా ఉంటుంది. ట్విట్టర్‌లో పోస్టును ట్వీట్ అని పిలుస్తుండగా.. ట్రూత్ యాప్‌లో పోస్టును మాత్రం ట్రూత్‌గా పిలుస్తారట. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి బరిలోకి దిగి ఓటమిపాలైన ట్రంప్.. ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడిన తర్వాత కూడా ఓటమిని అంగీకరించలేదు.. ఇప్పుడు సోషల్ మీడియా యాప్ తీసుకొస్తున్నారంటే.. దాని వెనుక పెద్ద ప్లానే ఉంటుందని చెబుతున్నారు విశ్లేషకులు.
తాజావార్తలు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!