యూఎస్‌లో కరోనా మహమ్మారి వీరలెవెల్లో విజృంభిస్తోంది. ప్రతిరోజు 11 నుంచి 12 లక్షల వరకు కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నది. అయితే, రోజురోజుకు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆందోళనలు మొదలయ్యాయి. అనేక రాష్ట్రాల్లోని ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆసుపత్రుల్లో వైద్యుల కొరత పెరిగిపోతున్నది. సాధారణ వైద్యం, ఆపరేషన్లను నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అత్యవసరమైతేనే వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం యూఎస్‌లో నమోదవుతున్న కేసుల్లో 98 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
Read: భారత్‌లో టెస్లా ఆగమనం… ఎలన్ మస్క్ ఆసక్తికర ట్వీట్…
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణకు ముందు చాలా దేశంలోని 70 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. సుమారు 20 నుంచి 30 శాతం మందికి బూస్టర్ డోసులు ఇచ్చారు. దీంతో ఒమిక్రాన్ సోకినా లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, పాజిటివ్ కేసులతో ఎప్పటికైనా డేంజర్ అని, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రాబోయే రోజుల్లో మరింతగా పెరిగితే వైద్యరంగం సంక్షోభంలో పడే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.