కొన్ని ఇల్లు భలే కలిసి వస్తుంటాయి. కొన్ని ఇల్లు మాత్రం అస్సలు ఎవరికీ కలిసిరావు. ఇంటిని ఇష్టపడి కట్టుకున్నా, కొనుక్కున్నా ఆ ఇంట్లో నివశించే వారికి ఎప్పుడూ తెలియని ఇబ్బందులు ఎదురౌతుంటాయి. అప్పులు, జబ్బులతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని నోయి వ్యాలీలో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ఇల్లు ఉన్నది. సుమారు 122 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద ఇళ్లు, లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. కానీ,…
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. యూరప్ దేశాల్లో కాస్త శాంతించినా అమెరికాలో కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగిపోతున్న నేపథ్యంలో అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలోని 22 దేశాలకు ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించింది. 80కి పైగా దేశాలను వెరీ హై రిస్క్ జోన్ దేశాల జాబితాలో సీడీసీ చేర్చింది. కాగా మరో 22 దేశాలను హైరిస్క్ దేశాల జాబితాలో చేర్చింది. లెవల్ 4 దేశాల జాబితాలో ఉంచిన దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణించవద్దని…
ప్రస్తుతం అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉన్నది. ఎలాంటి జబ్బులను నయం చేయడానికైనా మందులు అందుబాటులో ఉన్నాయి. పూర్వం రోజుల్లో ఇంతటి వైద్యం అందుబాటులో లేదు. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. తీవ్రమైన జబ్బులు వస్తే నాటు వైద్యం చేసేవారు. లేదా ఆ జబ్బులతో బాధపడుతూ మరణించేవారు. ఇక వేల సంవత్సరాల క్రితం వైద్యం ఎలా ఉంటుంది… అసలు వైద్యం గురించి అప్పట్లో ప్రజలకు తెలుసా లేదా అంటే, 2 వేల ఏళ్ల క్రితమే అత్యాధునిక వైద్యం అందుబాటులో…
అమెరికా మోడల్ కైలే జన్నర్ సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 30 కోట్ల ఫాలోవర్లతో రికార్డ్ సాధించింది. ఈ స్థాయిలో ఫాలోవర్లకు కలిగిన మొదటి మహిళగా కైలే జన్నర్ ఖ్యాతికెక్కింది. ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాకు 46 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, రెండో స్థానంలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో కు 38.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో కైలే జన్నర్ నిలిచింది. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యథిక…
అమెరికా అంటువ్యాధుల కమిటీ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కరోనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ కేసులు అమెరికాలో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ను అందిస్తున్నా కేసులు పెరుగుతుండటంపై సర్వత్రా అందోళన పెరుగుతున్నది. కరోనాను సమూలంగా అంతం చేయడం అసాధ్యమని డాక్టర్ ఫౌచీ పేర్కొన్నారు. కరోనాతో కలిసి జీవించాల్సిందే అని కుండబద్దలు కొట్టారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరిలో వైరస్ కనిపిస్తుందని, అయితే, వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఆ వ్యాక్తుల్లో వ్యాధి తీవ్రత…
అమెరికాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 13 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. సోమవారం రోజున 1.32 లక్షల మంది కరోనాతో చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. రాబోయే వారం పదిరోజుల్లో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నది. సుమారు 2 నుంచి మూడు లక్షల మంది ఆసుపత్రుల్లో చేరతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలరాడో, లూసియానా, మేరిలాండ్,…
2020లో కరోనా కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్, కర్ఫ్యూలు అమలు చేయడంతో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటికే పరిమితం కావడంతో చాలా వరకు రద్దీ తగ్గిపోయింది. అంతేకాదు, వాహనాలు పరిమిత సంఖ్యలో తిరగడంతో వాతావరణ కాలుష్యంలో అనేక మార్పులు సంభవించాయి. కరోనా కేసులు తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో తిరిగి అన్ని రంగాలు తెరుచుకున్నాయి. కార్మిక ఉపాధి రంగాలు తిరిగి తెరుచుకోవడంతో బొగ్గుకు డిమాండ్ పెరిగింది. పెద్ద ఎత్తున బొగ్గు తవ్వకాలు, పెట్రోల్ డీజిల్…
భూమిమీద నూకలు ఉంటే మరణం చివరి అంచులదాక వెళ్లినా తిరిగి వెనక్కి రావొచ్చు. నిండు నూరేళ్లు జీవించవచ్చు. అదే కాలం చెల్లితే రోడ్డుపై వెళ్తున్న సమయంలో తెలియకుండానే మెరుపుదాడికి బలికావొచ్చు. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. బతికినంత కాలం అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొచ్చినా సిద్ధంగా ఉండాలి. తృతిలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విమానం కూలిపోతే అందులో ఉన్న మనుషులు బతికి బట్టగట్టడం చాలా కష్టం. అదే విమానం రోడ్డుపై కూలిపోయి, అందులో…
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 19 అంతస్తులున్న ఓ అపార్ట్మెంట్లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 60 మందికి గాయాలయ్యాయి. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతిచెందిన 19 మందిలో 9 మంది చిన్నారులు ఉన్నారు. మొదటి రెండు అంతస్తుల్లో అగ్నిప్రమాదం జరగడంతో మిగతా అంతస్తులలో నివశిస్తున్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. Read: నకిలీ సర్టిఫికెట్లపై…