అమెరికాలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒకచోట గుమికూడకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. టెకీ ఉద్యోగులు గత ఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరికొన్నాళ్లు ఇదే మోడ్‌ను అమలు చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే, జనవరి 5 నుండి 8 వ తేదీ వరకు లాస్వేగాస్లో టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరగాల్సి ఉంది. ఈ షో భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. Read:…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా 20 ఏళ్ల పాటు జరిపిన పోరాటంలో పాకిస్తాన్ భాగస్వామ్యం కావడంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా.. కేవలం డబ్బు కోసమే అమెరికాతో తమ దేశం అప్పట్లో చేతులు కలిపిందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ”ఇతరులు మనల్ని వాడుకునేందుకు నాడు మనమే అవకాశమిచ్చాం. దేశ ప్రతిష్టను పణంగా పెట్టాం. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా, డబ్బు…
భారత్ కు చెందిన విప్రో కంపెనీ అమెరికాకు చెందిన లీన్ స్విఫ్ట్ సోల్యూషన్స్ ను సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఒప్పందాలు బుధవారం రోజున పూర్తి చేసినట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ బిజినెస్‌ను విస్తరించడానికి విప్రో లీన్ స్విఫ్ట్ సోల్యూషన్స్‌ను కొనుగోలు చేసింది. 2022 మార్చి 31 తో లీన్ స్విఫ్ట్ పూర్తిగా విప్రోలో విలీనం అవుతుంది. యూఎస్, స్వీడన్, భారత్ లో లీన్‌స్విఫ్ట్ కంపెనీ కార్యాలయాలను కలిగి యుంది. పంపిణీ, రసాయనాలు, ఫ్యాషన్,…
రష్యా-ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. 75 వేల మంది బలగాలను రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. కాగా, ఇప్పుడు అమెరికా బాటలోనే జర్మనీ కూడా హెచ్చరించింది. జర్మనీ కొత్త ఛాన్సలర్ స్కాల్జ్ కూడా రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ పై ఎలాంటి యుద్ద చర్యలకు పాల్పడినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని, రష్యా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని…
చాలా దేశాల్లో సంపాదించే డబ్బుకన్నా కట్టాల్సిన టాక్స్‌లు అధికంగా ఉంటాయి. చట్టాలు కూడా కఠినంగా ఉండటంతో ఖచ్చితంగా ట్యాక్స్‌లు కట్టాల్సిఉంటుంది. వాటి నుంచి తప్పించుకునేందుకు ట్యాక్స్‌లు తక్కువగా ఉండే దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అమెరికాలో టాక్స్‌లు అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అందుకే చాలామంది డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చుకుంటున్నారు. చాలా దేశాలు అధికారికంగా కాకపోయినా అనధికారికంగా క్రిప్టో కరెన్సీ వాడకానికి అనుమతులు ఇవ్వడంతో వస్తువులను, ప్రాపర్టీస్‌ను క్రిప్టో నుంచి కొనుగోలు చేస్తున్నారు. కరేబియన్ దీవుల్లో విదేశీయులకు…
వన్ చైనా పాలసీలో భాగంగా ఎప్పటికైనా తైవాన్ను తన సొంతం చేసుకోవాలని డ్రాగన్ చూస్తున్నది. ఆ దిశగానే పావులు కదుపుతూ, తైవాన్‌తో దోస్తీ కట్టిన దేశాలను నయానో భయనో ఒప్పించి ఆ దేశం నుంచి బయటకు పంపిస్తోంది. 2025 నాటికి తైవాన్ను తన దేశంలో కలిపేసుకోవాలన్నది చైనా లక్ష్యం. అయితే, దీనికి అమెరికా అడ్డుపడుతున్నది. తైవాన్‌పై డ్రాగన్ ఎలాంటి సైనికచర్యలకు పాల్పడినా చూస్తూ ఊరుకునేది లేదని, తైవాన్ తరపున పోరాటం చేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు,…
అమెరికా రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా కన్నేసింది. ఆ దేశ సరిహద్దులో 75 వేల సైనిక బలగాలను మోహరించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీంతో ఆప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్‌పై రష్యా ఎలాంటి దాడులకు పాల్పడినా తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించింది. Read: చేతకాని వైసీపీ ఎంపీలు చట్టసభల్లో దేనికి?: పవన్ కళ్యాణ్ రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికాతో పాటుగా జీ7…
అదృష్టం ఎప్పుడు ఎవర్నీ ఎలా పలకరిస్తుందో చెప్పలేం. ఒక్కోసారి మనకు తెలియకుండానే మన కష్టాల గురించి తెలుసుకున్న వ్యక్తులు వారికోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. మానవతా దృక్పదంలో ఆదుకుంటారు. కష్టాల నుంచి బయటపడేస్తారు. జాస్మిన్ కాస్టీలో అనే మహిళ విషయంలోనూ అదే జరిగింది. కాస్టీలో అనే మహిళ ఓ రెస్తారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నది. రెస్టారెంట్లో పనిచేస్తూ తన కూతురును డే కేర్‌లో ఉంచి చదివిస్తోంది. అయితే, ఆ రెస్టారెంట్‌కు ఓరోజు విలియమ్స్ అనే మహిళ వచ్చింది.…
అమెరికాలో ఎప్పుడూ లేని విధంగా టోర్నడోలు విరుచుకుపడ్డాయి. ఆరురాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడటంతో సుమారు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గల్లంతైయ్యారు. గల్లంతైన వారిలో ఎంతమంది మరణించారో తెలియదని స్థానిక వార్తసంస్థలు పేర్కొన్నాయి. దీంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనావేస్తున్నాయి. Read: ఛండీగడ్ తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. టోర్నడోలు విరుచుకుపడిన ప్రాంతాల పరిస్థితులపై జో బైడెన్ సమీక్షను నిర్వహించారు. కెంటకీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. త్వరలనే టోర్నడో…
అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెంటకీ రాష్ట్రంలో 70 మంది క్యాండిల్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోవటంతో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు అధికారులు. కెంటకీలో మొత్తం రెండు వందల మైళ్ల నుంచి 227 మైళ్ల వరకు టోర్నడోల ప్రభావం కనిపించింది. రాష్ట్రంలోని మేఫీల్డ్ నగరంలో టోర్నడోల దెబ్బకు బాంబు పేలినట్లుగా అనిపించిందని చెబుతున్నారు స్థానికులు. ఇక..కెంటకీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన గాలులకు……