2020లో కరోనా కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్, కర్ఫ్యూలు అమలు చేయడంతో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటికే పరిమితం కావడంతో చాలా వరకు రద్దీ తగ్గిపోయింది. అంతేకాదు, వాహనాలు పరిమిత సంఖ్యలో తిరగడంతో వాతావరణ కాలుష్యంలో అనేక మార్పులు సంభవించాయి. కరోనా కేసులు తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో తిరిగి అన్ని రంగాలు తెరుచుకున్నాయి. కార్మిక ఉపాధి రంగాలు తిరిగి తెరుచుకోవడంతో బొగ్గుకు డిమాండ్ పెరిగింది. పెద్ద ఎత్తున బొగ్గు తవ్వకాలు, పెట్రోల్ డీజిల్ వినియోగం పెరిగింది.
Read: బెటర్ వర్డ్స్ మ్యాన్… సిద్ధార్థ్ ట్వీట్ పై సైనా భర్త రియాక్షన్
డిమాండ్‌కు తగిన విధంగా సప్లై కోసం 24 గంటల పాటు పరిశ్రమలను నడిచే ఏర్పాట్లు చేశారు. దీంతో మళ్లీ కాలుష్యం పెరిగిపోయింది. ముఖ్యంగా అమెరికాలో కర్బన వాయువుల ఉద్గారం పెరిగిపోయింది. 2020తో పోలిస్తే, 2021లో కర్భన వాయువుల ఉద్గారం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీని వలన వాతావరణానికి ముప్పు సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.