కరోనా మహమ్మారి మనుషుల మధ్య బంధాలను తెంచేస్తోంది. మనుషుల మానవత్వాన్ని చంపేస్తేన్నది. అమెరికాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. చిన్నారులు అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. అమెరికాలోని టెక్సాన్ కు చెందిన సారాబీమ్ అనే మహిళ డ్రైవ్ త్రూ టెస్టింగ్ కేంద్రానికి కారును తీసుకొని వచ్చారు. అలా వచ్చిన ఆ మహిళ కారు డిక్కిలో నుంచి మాటలు వినిపిస్తుండటంతో అక్కడ ఉన్న సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read: ఎన్నికలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్…!!
అధికారులు కారు డిక్కీ ఓపెన్ చేసి చూడగా అందులో 13 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు. అతను తన కుమారుడే అని, కరోనా సోకడంతో మరోసారి పరీక్ష చేయించేందుకు తీసుకెళ్తున్నానని చెప్పింది. అయితే, పిల్లవాడిని వెనుక సీట్లో కూర్చోబెట్టాలని అధికారులు పట్టుబట్టారు. కరోనా సోకుతుందనే భయంతో అందుకు ఒప్పుకోలేదు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పిల్లవాడిని కారు డిక్కిలో బంధించి తీసుకొచ్చినందుకు సారా బీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.