అమెరికాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 13 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. సోమవారం రోజున 1.32 లక్షల మంది కరోనాతో చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. రాబోయే వారం పదిరోజుల్లో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నది. సుమారు 2 నుంచి మూడు లక్షల మంది ఆసుపత్రుల్లో చేరతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలరాడో, లూసియానా, మేరిలాండ్, వర్జీనియా రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.
Read: 2021లో భారీగా పెరిగిన కాలుష్యం… వాతావరణానికి ముప్పు తప్పదా?
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసులతో పాటు చికిత్సకోసం ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండటంతో సిబ్బంది సిబ్బంది కొరత తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నది. సుమారు 1200 ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో సిబ్బందిని వెంటనే రిక్రూట్ చేసుకోవాలని, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.