అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 19 అంతస్తులున్న ఓ అపార్ట్‌మెంట్‌లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 60 మందికి గాయాలయ్యాయి. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతిచెందిన 19 మందిలో 9 మంది చిన్నారులు ఉన్నారు. మొదటి రెండు అంతస్తుల్లో అగ్నిప్రమాదం జరగడంతో మిగతా అంతస్తులలో నివశిస్తున్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది.
Read: నకిలీ సర్టిఫికెట్‌లపై ఉన్నత విద్యామండలి నజర్..
వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 200 మంది ఫైర్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇలాంటి దుర్ఘటన న్యూయార్క్ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని అధికారులు చెబుతున్నారు. మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటి అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.