కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం సందర్శిస్తుంటారు. ఎంతో ఖ్యాతి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నేడు(శనివారం) మరోసారి ఆలయ గోపురం పై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. కాగా ఆగమ శాస్త్రాల నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి రాకపోకలు నిషిద్ధం. రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు టీటీడీకి సూచించారు. దీనిపై టీటీడీ పలుమార్లు కేంద్రానికి…
ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు.. దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయబోతున్నారు.. ఇవాళ ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లు పెట్టబోతున్నారు.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.
తనదైన మార్క్ పాలనను మొదలెట్టిన ట్రంప్.. పౌరసత్వంపై కొత్త ఉత్తర్వులు! అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి చిన్నారికి పౌరసత్వం లభించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం, అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి సహజంగా పౌరసత్వ హక్కు లభించేది. ఇది 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. కానీ, తాజాగా ట్రంప్ ఈ చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (Executive Order) ద్వారా రద్దు చేస్తూ కీలక నిర్ణయం…
శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. అయితే ప్రస్తుతం ఇది ట్రయల్ రన్లో ఉంది. ట్రయల్ రన్లో భాగంగా సోమవారం 5 వేల మసాలా వడలను టీటీడీ సిబ్బంది భక్తులకు వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తి స్థాయిలో అమలు చేస్తారని తెలుస్తోంది. శ్రీవారి భక్తులకు కొన్నేళ్లుగా…
నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు. నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక. లబ్దిదారుల జాబితా గ్రామ సభల్లో ప్రకటన. అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 24 వరకు జరగనున్న గ్రామ సభలు. దావోస్లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటన. సీఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొననున్న…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన ప్రారంభించారు.. ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు 5 వేల మంది భక్తులకు (ఉల్లిపాయ వాడకుండా) చేసిన మసాలా వడలు వడ్డించారు టీటీడీ సిబ్బంది..
నేడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు (జనవరి 20) మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే, కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు చేరుకున్నారు. అయితే, గత నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవనంపై తన మద్దతుదారులు చేసిన దాడితో వైట్ హౌస్ ను ట్రంప్ వీడాడు. ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ఈ ప్రమాణ వేడుకకు…
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగిశాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు…
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాప ప్రక్షాళన చేస్తాను అని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కేంద్ర హోం శాఖ విపత్తుల నిర్వహణ శాఖ విచారణకు ఆదేశిస్తే, మీరు రద్దు చేయించారని తెలిపారు.