తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత సంచరించింది. ఇవాళ వేకువజామున ఒంటిగంట సమయంలో గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలో సంచరించింది. నడక మార్గంలోకి వచ్చి.. పిల్లిని వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాలను చూసి దుకాణదారులు షాక్ అవుతున్నారు.
చిరుత సంచారం సమాచారంపై మెట్ల మార్గం వద్ద దుకాణదారులు ఫారెస్ట్, టీటీడీ విజిలెల్స్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు తనిఖీ చేయగా.. చిరుత జాడ ఎక్కడా కనిపించలేదు. టీటీడీ అధికారులు నడక మార్గంలో భక్తులను అలెర్ట్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ల లోపు చిన్న పిల్లలను నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతిని ఇచ్చారు. మధ్యాహ్నం అనంతరం భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. చిరుత సంచారంతో భక్తులు, ప్రజలు భయాందోళనలు గురవుతున్నారు.