తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని అనంతపురం రేంజ్ డీఐజీ తెలిపారు. 2500 మంది సిబ్బందితో పది రోజులు పాటు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మొన్న జరిగిన ఘటన పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. ఉహించనిదన్నారు. భక్తుల భద్రతపై పూర్తి భరోసా పోలీసు శాఖ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై భక్తులు వద్ద ఏమైన ఆధారాలు ఉంటే సమర్పించాలని..…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిగింది. అనేక భక్తులు వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్నా నేపథ్యంలో.. వారిని వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. వేలాదిగా భక్తులు తిరుమల కొండపైకి వస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ వేళ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ ప్రత్యేక వైకుంఠం ద్వార దర్శనం చేయించింది.
తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరు నిండు ప్రాణాలు బలయ్యాయి. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై నిన్న మీడియాతో మాట్లాడిన ఆర్కేరోజా తాజాగా మరోసారి ట్వీట్ చేశారు. ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. "వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు పొందడం కోసం భక్తులు పరితపించారు.
ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం.. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ అందరూ బాధ్యులే.. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేవారు.. గాయపడిన వారికి మంచి వైద్యం అందించడంతో పాటు, డిశ్చార్జ్ సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలన్నారు.. చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు. భయం…
తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన క్షమాపణ కోరారు. తప్పు జరిగింది.. క్షమించాలని విన్నవించారు.
నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, కొద్దిసేపటి కిందట ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలను అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్..
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. సీఎం చంద్రబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొత్తం ఘటన స్థలం అంత తిరుగుతూ అధికారులను ఆరా తీశారు. అసలు తొక్కిసలాటలు అంటే ఏంటి? దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఘటనల గురించి పూర్తిగా తెలుసుకుందాం… తొక్కిసలాటలు అంటే అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎక్కువ మంది జనాలు ఒక చోట ఉన్నప్పుడు ఆందోళనకు…
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. 40 మందికి పైగా క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఇప్పటికే పలువురు మంత్రులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదం జరిగిన బైరాగిపల్లె రామానాయుడు స్కూల్, పద్మావతి పార్క్కు చేరుకున్నారు.
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు.మరికొందరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు... అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది... రెప్పపాటులో అంత ఘోరం ఎలా జరిగిపోయింది. ఘటన గురించి పూర్తిగా తెలుసుకుందాం..