Local Devotees: ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈ రోజు ( మార్చి 02వ తేది) స్థానిక దర్శన కోటా టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టికెట్లు ఇవ్వనున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి స్వామి వారి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఇక, తిరుమలపై కుంభమేళా ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరి నెలలో భక్తుల తాకిడి క్రమంగా తగ్గింది. గత నెలలో ఒక్క రోజు కూడా బయటకి రాని క్యూ లైన్లు.. ఎక్కువ రోజులు కంపార్టుమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం కంప్లీంట్ అయింది. ఫిబ్రవరి నెలలో భక్తుల సంఖ్య తగ్గడంతో.. కేవలం స్వామివారిని 19.12 లక్షల మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు.