Alert for Tirumala Devotees: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మే నెల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అందులో మొదటగా.. రేపు ఉదయం అనగా ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి.. ఇక, 21వ తేదీ ఉదయం ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది టీటీడీ.. 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టిక్కెట్లు విడుదల చేయనుండగా.. అదే రోజు 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కాబోతున్నాయి.. ఇక, 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనున్నట్టు వెల్లడించింది టీటీడీ..
Read Also: Chhaava: రోజు రోజుకీ పెరుగుతున్న “ఛావా” క్రేజ్