Off The Record: టీటీడీలో ఆ పోస్ట్ అంటే పిచ్చ క్రేజ్..! కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత మారిపోయిన సీన్
- టీటీడీ బడ్జెట్‌లో ముడి సరకుల కొనుగోలు కోసం రూ.768 కోట్లు
- మార్కెటింగ్ మేనేజర్‌గా ఈఈ స్థాయి అధికారి
- రూ.768 కోట్ల బడ్జెట్ ఒక్క ఈఈ పరిధిలోనే
- గతంలో మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్‌కు పిచ్చ క్రేజ్
- కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత మారిపోయిన సీన్
- సిట్ లోతుల్లోకి వెళ్తుండటంతో అధికారుల్లో గుబులు
- చిన్న చిన్న గిఫ్ట్‌లకు పడిపోయిన ఉదంతాలు కూడా వెలుగులోకి
- భయపడి లాంగ్ లీవ్‌లో అమెరికా వెళ్ళిన ఓ అధికారి
- వీఆర్‌ఎస్ ఆలోచనలో మరో అధికారి
- ట్రాన్స్‌ఫర్ వీలవక మెడికల్ లీవ్‌లో
- చివరికి ప్రమోషన్ ఎరగావేసి ఈఈ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఒకప్పుడు టీటీడీలో ఆ పోస్ట్ అంటే పిచ్చ క్రేజ్. పైరవీలు చేసుకుని మరీ ఆ సీట్లో కూర్చునేవారట. కానీ… ఇప్పుడు రా… రమ్మని పిలిచి హారతి ఇచ్చి కూర్చోబెట్టినా… మావల్ల కాదు బాబోయ్ అంటూ పారిపోతున్నారట. కాదు కూడదంటే మెడికల్ లీవ్ పెట్టి పారిపోతున్నారట. ఇంతకీ ఏంటా పోస్ట్? ఎందుకా పరిస్థితి వచ్చింది?
Read Also: Congress BC Leaders: రేపు తెలంగాణ గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ బీసీ నేతలు..
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండెక్కిన ప్రతి భక్తుడు తృప్తిగా శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరిచేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. నిత్యాన్నదానంతోపాటు దర్శనాంతరం ఆలయంలో ప్రసాదాలు పంపిణీ చేస్తుంది దేవస్థానం. లడ్డు, వడలాంటి వాటిని భక్తులుకు విక్రయిస్తుంది. ఇలా… ఏడాదికి రెండున్నర కోట్ల మందిదాకా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటే… నెలకు కోటి వరకు లడ్డూలను విక్రయిస్తోంది టీటీడీ. ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. ఆ స్థాయిలో ప్రసాదాలను తయారు చేయడం ఒక ఎత్తయితే… అందుకు సంబంధించిన నాణ్యమైన సరకులను కొనడం, ఎక్కడా తేడా రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ముడి సరకుల్ని టెండర్స్ ద్వారా సేకరిస్తుంది తిరుమల తిరుపతి దేనవస్థానం బోర్డ్. టిటిడి వార్షిక బడ్జెట్ 5వేల258 కోట్లు అయితే…. అందులో జీతాల చెల్లింపునకు 1,773 కోట్లు పోతుంది. ఆ తర్వాత ఎక్కువ కేటాయింపులు జరిగేది ముడి సరుకుల కొనుగోళ్ళకే. ఇందుకోసం 768 కోట్లు కేటాయిస్తుంది దేవస్థానం. ఆ తరువాత ఇంజనీరింగ్ పనుల కోసం 350 కోట్ల బడ్జెట్ ఉంటుంది.
Read Also: CBG Plant: ఏపీలో సీబీజీ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆర్వెన్సిస్ గ్రూప్!
ఇక, ముడి సరకులు కోనుగోలుకు ప్రత్యేకంగా మార్కెటింగ్ విభాగం ఉంటుంది. ఇందులో అధికారులను మాత్రం ఎక్కువగా ఇంజనీరింగ్ శాఖ నుంచే నియమిస్తూంటారు. ఈఈ స్థాయి అధికారిని మార్కెటింగ్ మేనేజర్‌గా నియమిస్తారు. దశాబ్దాల తరబడి ఆ పోస్ట్‌కు డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే… 15 మంది వరకు ఈఈలు వుండే ఇంజనీరింగ్ శాఖ వార్షిక బడ్జెట్ 350 కోట్లుకాగా…ఒకే ఒక్క ఈఈ వుండే మార్కెటింగ్ విభాగం బడ్జెట్ 768 కోట్లు. అలాంటి డిపార్ట్‌మెంట్‌లో ఇప్పుడు పరిస్థితి వేరుగా వుందట. ఒకప్పుడు మాకంటే మాకంటూ మార్కెటింగ్ ఈఈ పోస్ట్ కోసం ఎగబడి… పైరవీలు సైతం చేసుకునే అధికారులు ఇప్పుడు మాత్రం… ఆ పోస్టా… మాకొద్దు బాబోయ్ అంటున్నట్టు సమాచాకం. శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం తర్వాత సీన్ మొత్తం మారిపోయిందట. నిరుడు జులైలో కల్తీ నెయ్యి అంశం వెలుగులోకి రావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ రాకతో మార్కెటింగ్ విభాగం అధికారుల్లో గుబులు మొదలైందట. దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ చేస్తూండడం, గతంలో విధులు నిర్వహించిన వారిని కూడా బాధ్యుల్ని చేస్తుండటంతో…. వాతావరణం టెన్షన్‌గా ఉందని చెప్పుకుంటున్నారు. గతంలో నిజాయితీకి మారు పేరుగా గుర్తింపు ఉన్న అధికారులు కూడా చిన్న చిన్న గిప్టులకు పడిపోయిన అంశాలు సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయట.
Read Also: Pakistan: కరాచీ, లాహోర్ ఎయిర్‌స్పేస్‌ని పాక్షికంగా మూసేసిన పాకిస్తాన్..
అయితే, ఇలా పాత వ్యవహారాలన్నిటినీ తవ్వుతుండటంతో…. కొత్తగా ఈ పోస్టు అంటేనే భయపడిపోతున్నారు అయ్య బాబోయ్ అంటున్నారట ఇంజనీర్లు. అసలు కల్తీ నెయ్యి అంశంపై పోలీస్ స్ఠేషన్‌లో ఫిర్యాదు చేసిన అధికారే ముందుగా లాంగ్ లీవ్ పెట్టి అమెరికాలో వున్న కుటుంబసభ్యులకు దగ్గరకు వెళ్లిపోయారు. ఆ తరువాత వచ్చిన అధికారికి నిజాయితీ ముద్ర ఉంది. టీటీడీలో మంచి ట్రాక్ ఉన్న సదరు ఆఫీసర్….సిట్ విచారణ శైలితో వీఆర్‌ఎస్ తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఈ టెన్షన్ మాకు వద్దంటూ మెడికల్ లీవ్ లో వెళ్లిపోయ్యారట ఆయన. అంతకు ముందు బదిలీ కోసం విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి మెడికల్ లీవ్ పెట్టేసినట్టు సమాచారం. కీలకమైన ఆ పోస్టులో సంభందిత అధికారి లేకపోతే రోజువారి కార్యకలాపాలకు ఇబ్బందులు వస్తాయి. కానీ… ఎంత చెబుతున్నా… మార్కెటింగ్ ఈఈ బాధ్యతలు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదట. గడిచిన పది నెలల్లో… ఇద్దరు ఇంజనీర్లు ఈ పోస్టు మాకొద్దని శెలవులో వెళ్లిపోతే.. చివరికి ప్రమోషన్‌ని ఎరగా వేసి డిప్యూటీ ఈఈని ఆ పోస్టులో ఇంచార్జ్ గా నియమించారు. వాస్తవానికి కోర్టు వివాదం కారణంగా గత ఐదేళ్ళ నుంచి టీటీడీలో ఉద్యోగుల ప్రమోషన్ ప్రకియ నిలిపోయింది. అలాంటిది మార్కెటింగ్ మేనేజర్ గా డిప్యూటి ఈఈని ఇన్ఛార్జ్‌గా నియమించే పరిస్థితి ఏర్పడింది. ఈయనన్నా ఉంటారా? లేక వద్దు మొర్రో అని వెళ్ళిపోతారా అన్నది చూడాలన్న చర్చ జరుగుతోంది టీటీడీలో.
తాజావార్తలు
-
Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
-
Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
-
ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
-
IMD Alert: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండాలు.. దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Uttar Pradesh: నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు.. ప్రేమ పెళ్లి, ఇప్పుడు ప్రాణభయం..
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!