తిరుమల అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలపకుండానే ఓ వ్యక్తి దూసుకెళ్లాడు. అతడిని నిలువరించేందుకు యత్నించిన సమయంలో ద్విచక్ర వాహనంతో భద్రతా సిబ్బందిపై దూసుకెళ్లాడు. ఘాట్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టాడు. చివరకు తిరుమల లోని జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సింగాలగుంటకి చెందిన అమీర్ అంజద్ ఖాన్ అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద…
Flight On Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అటవీశాఖ అధికారులు చేసిన పని టీటీడీకి తలనొప్పిగా మారింది. పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో అటవీశాఖ అధికారులు పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ కి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణులను రప్పించారు.
భక్తుల దాహార్తిని తీర్చే తిరుమలలోని పాపవినాశనం డ్యాంలో ఐదుగురు వ్యక్తులు మంగళవారం కయాక్ బోట్లలో తిరిగారు. తిరుమలలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పాపవినాశనం డ్యాంలో బోటింగ్ ఏర్పాటు చేసేందుకు సర్వే జరిగినట్టు కొందరు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. ఈ అంశంపై తాజాగా టీటీడీ స్పందించింది. దీంతో తిరుమల పాప వినాశనం డ్యాంలో బోటింగ్‌పై అటవీశాఖ యూటర్న్ తీసుకుంది. అటవీశాఖ అధికారులు టీటీడీకి కనీస సమాచారం అందించకుండా డ్యాంలో సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో బోటింగ్ కోసం ట్రయల్…
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్యక్షతన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 5258 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. హుండీ ద్వారా రూ. 1,729 కోట్లు ఆదాయం లభిస్తూందని పాలక మండలి అంచనా వేసింది. వడ్డీల ద్వారా రూ. 1,310 కోట్లు ఆదాయం లభిస్తూందని అంచనా వేశారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 600 కోట్లు, దర్శన టిక్కెట్ల…
Tirumala Rush: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో తిరుమలలో 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లారు. పద్మావతి అతిధి గృహం నుంచి కుటుంబంతో కలిసి శ్రీవారి ఆలయానికి భయలుదేరి, కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఇఓ శ్యామలరావు, అదనపు ఇఓ వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబుుకు స్వాగతం పలికారు. మంగళవాయుద్యాలు.. వేదమంత్రోచ్చారణల మధ్య మనవడు దేవాన్ష్ తో కలిసి ఆలయ ప్రవేశం చేశారు. చంద్రబాబు కుటుంబసభ్యులను ప్రధాన అర్చకులు ఆశ్వీరదించారు. Also Read:Pakistan: పాక్‌లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల…
తిరుమలలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు. నేడు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్న చంద్రబాబు కుటుంబం. తిరుమల: నేడు జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల.. ఆన్లైన్లో శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్స్, 11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్స్…
తిరుమల తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. నేడు CVSO శ్రీధర్‌ను విచారించనున్న కమిషన్. 21 నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్ సిబ్బంది 32 మంది పోలీసులను విచారించనున్న కమిషన్. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ. SLBC టన్నెల్లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన ఏడుగురి కోసం క్యాడవర్ డాగ్స్‌తో గాలింపు. డీ2, డీ1 ప్రదేశాల్లో మిని జేసీబీలతో తవ్వకాలు. ఆచూకీ…
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్. జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల కోటాను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల లక్కీడిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు టీటీడీ…