TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి జులై 15 వరకు కొత్త రూల్..!
- తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం..
- మే 1 నుంచి జులై 15 వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు..
- స్వయంగా విచ్చేసే వీఐపీలకు మాత్రమే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కలియుగ ప్రత్యక్షదైశం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. మే 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. వేసవి సెలవులు కావడంతో.. తిరుమలకు భక్తులు పోటెత్తుతుంటారు.. ఇక, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మే 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ.. ఈ సమయంలో స్వయంగా విచ్చేసే వీఐపీలకు మాత్రమే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.. మే 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటలకు ప్రారంభించబోతోంది టీటీడీ.. అయితే, సిఫార్సు లేఖలు తీసుకుని శ్రీవారి దర్శానికి ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులు.. ఈ విషయాన్ని గమనించాలి..
Read Also: RAPO 22 : రామ్ పోతినేని సినిమాలో రియల్ స్టార్.?
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
మరోవైపు.. మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. ఈ నేపథ్యంలో మూడు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు.. మరోవైపు.. ఆదివారం రోజు 78,177 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. ఇక, హుండీ ఆదాయం రూ.3.53 కోట్లుగా వెల్లడించింది టీటీడీ..
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!