టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… 2015లో జరిగిన ఘర్షణ కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. దానం నాగేందర్‌కు వెయ్యి రూపాయాలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.. 2015లో జరిగిన ఘర్షణ కేసులో ఇవాళ హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ మరియు ఎమ్మెల్యేల స్పెషల్ సెషన్ కోర్టులో విచారణ జరిగింది.. యూ/ఎస్ 323,506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ ప్రకారం బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ పూర్తి…
నా పైన మావోయిస్టు పార్టీ రాసింది నిజమైన లేఖ కాదు.. అది సృష్టించారు అని అన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు. నేను రైతు బంధు వద్దు అని అనలేదు. ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి మాత్రమే వద్దన్నాను అని స్పష్టం చేసారు ఈటల. పోలీసులు చట్ట బద్దంగా పని చెయ్యాలి. బయటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్ దిన్…
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి.. మాజీ మంత్రికి పడటం లేదట. పెత్తనం కోసం ఇద్దరూ ఫైటింగ్ చేస్తున్నారు. రెండువర్గాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. అదికాస్తా స్థానికంగా అధికారపార్టీలో రచ్చగా మారుతోంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం? జహీరాబాద్ టీఆర్‌ఎస్‌లో మాణిక్‌రావు వర్సెస్ ఫరీదుద్దీన్! మాణిక్‌రావు. ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే. ఇదే నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేత.. మాజీ మంత్రి ఫరీదుద్దీన్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. విభేదాలు తారాస్థాయికి చేరినట్టు పార్టీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.…
హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్‌ఎస్ వ్యూహం మార్చిందా? ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్టు ఎత్తుగడలు ఉండబోతున్నాయా? గుత్తగా గురిపెట్టడానికి ప్లాన్ సిద్ధమైందా? ఇంతకీ ఏంటా వ్యూహం? గులాబీ శిబిరం టార్గెట్ ఏంటి? హుజురాబాద్‌లో మారిన టీఆర్‌ఎస్ వ్యూహం? మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉపఎన్నిక జరిగే హుజురాబాద్‌లో అధికారపార్టీ పూర్తిస్థాయిలో పట్టు సాధించే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. సీనియర్ నాయకులు నియోజకవర్గాన్ని జల్లెడ పట్టినట్టుగా…
కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని.. ఆ దీక్షకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. తెలంగాణ కోసం ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్న ఆయన.. దీక్షలు చేయాలని మాకు చెప్పడం కాదు.. ముందు కాంగ్రెస్ పార్టీ…
హుజురాబాద్‌లో ప్రచారంలో బిజీగా ఉన్న మాజీ మంత్రి ఈటల మంత్రి హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ మందిని మంత్రి హరీష్ రావు తీసుకు పోయి… దావత్, డబ్బులు ఇవ్వాలని… ఇదే పని ఆయనది అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మెప్పు పొందాలనే ఇలా మంత్రి హరీష్ రావు చేస్తున్నాడని ఫైర్ అయిన ఈటల..హరీష్ కు కూడా తన గతే పడుతుందన్నారు. హుజూరాబాద్ చైతన్యవంతమైనా గడ్డ అని పేర్కొన్న ఈటల… ప్రాణాన్ని లెక్కచేయకుండా పోరాటం చేసిన గడ్డ…
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జులై 24, 2019 లో తను దత్తత తీసుకున్న కీసర రిజర్వు ఫారెస్ట్ లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఈరోజు నూర్ మహమ్మద్ కుంట దగ్గర లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదటి మొక్కను మంత్రి మల్లా రెడ్డి గారితో కలిసి నాటి ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రీన్…
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది.. రాళ్లతో కొట్టడం, ఉరికించి కొట్టడం, చెప్పుల దండలు.. ఇలా ఇప్పుడు లోపల(జైలు)కి పోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చేవరకు వచ్చింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. టి.పీసీసీ చీఫ్ రేవంత్‌పై విరుచుకుపడ్డారు.. ఈ నెల 7వ తేదీ తర్వాత ఎవరు ఏం చేస్తారో తెలుస్తుందన్న…
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్నది. వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకొని టీఆర్ఎస్‌ను ఢీకొట్టాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే త్వరలో బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకూ తొలివిడత పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆగస్టు 9 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ కీలక…