మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme C83 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (Realme) భారత మార్కెట్లో సరికొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ రియల్మీ C83 5G (Realme C83 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. ముఖ్యంగా భారీ బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే మరియు 5G కనెక్టివిటీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణలు.
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో ప్రధాన హైలైట్‌గా 7,000mAh భారీ ‘టైటాన్’ బ్యాటరీను అందించారు. కంపెనీ ప్రకారం ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 37 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ ఇస్తుంది. అలాగే 27 గంటలకు పైగా వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. ఈ బ్యాటరీ దాదాపు 6 సంవత్సరాల పాటు మంచి పనితీరును కొనసాగిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో రావడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది.
ప్రాసెసింగ్ కోసం ఇందులో మీడియాటెక్ డిమెంసిటీ 6300 5G చిప్‌సెట్ ను అమర్చారు. అంతేకాకుండా వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ మరింత సులభంగా జరుగుతుంది.
ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 13MP ప్రైమరీ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0తో పనిచేస్తుంది. అలాగే దుమ్ము & నీటి నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ను కలిగి ఉంది. బలమైన నిర్మాణం కోసం MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా పొందింది.
CM Chandrababu: సూపర్ సిక్స్ అమలు చేశాం.. కేంద్ర పథకాలను పునరుద్ధరించాం.!
ఈ మొబైల్ భారత్‌లో మూడు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 13,499, 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 14,499, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 17,499 గా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 7 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇది బ్లూమింగ్ పర్పల్, స్ప్రౌటింగ్ గ్రీన్ రంగులలో లభిస్తుంది.
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!