ఏం చేయాలో కేసీఆర్ తెలుసు.. మీరేం చేస్తారో చెప్పండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని.. ఆ దీక్షకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. తెలంగాణ కోసం ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్న ఆయన.. దీక్షలు చేయాలని మాకు చెప్పడం కాదు.. ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక, తెలంగాణకి అవసరమయ్యే మల్లన్న సాగర్ పై కాంగ్రెస్ పార్టీ 300 కేసులు వేసిందని మండిపడ్డ ఆయన.. మరి అన్యాయం జరిగే పోతిరెడ్డిపై ఏం చేస్తారని నిలదీశారు. మరోవైపు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చట్టప్రకారం టీఆర్‌ఎస్‌లోకి వచ్చారన్నారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి అవసరముంటే చట్టపరంగానే ఏమైనా చూసుకోవాలని సలహా ఇచ్చారు. కాగా, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం అయిన తర్వాత.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి హాట్ కామెంట్లు చేయడం.. దానికి వాళ్లు కౌంటర్ ఇవ్వడం.. ఇక, రేవంత్, కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యల్లో మరింత పదునుపెంచిన సంగతి తెలిసిందే.. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా అదేస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!