హుజురాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.. కానీ, అప్పుడే ఉప ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. ఓవైపు.. టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ విజయం సాధిస్తానన్న ధీమాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు నియోజకవర్గంలో మకాం వేసి పావులు కదుపుతున్నారు.. ఇదే సమయంలో.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన కౌశిక్‌రెడ్డి ఆడియో సంచలనం సృష్టించింది.. ఆ వెంటనే షోకాజ్ నోటీసులు, రాజీనామా,…
ఆయనో మాజీ ఎంపీ. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా.. భవిష్యత్ ప్రయాణం ఏంటో వెల్లడించలేదు. కాసేపు అటు.. మరికాసేపు ఇటు అన్నట్టు ఆయన ట్వీట్లు ఉంటున్నాయా? ఇంతకీ ఆయన ఆ గట్టున ఉంటారా.. ఈ గట్టున రిలాక్స్ అవుతారా? క్రాస్‌రోడ్స్‌లోనే ఉండిపోయారా? కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌లో ఉండగా.. చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో రాజకీయంగా లక్ కలిసి రాలేదు. ఇక అక్కడ ఉండటం అవసరం లేదనుకున్నారో…
నోటి దురుసే ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందా? ఆయన్ని సపోర్ట్ చేసినవారిని కూడా ఇరకాటంలో పెట్టిందా? కాంగ్రెస్‌లో కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌ను ఎలా చూడాలి? వేటు వేస్తారని తెలిసి జాగ్రత్త పడినా.. పార్టీలో చికాకు కలిగింది ఎవరికి? కౌశిక్‌రెడ్డిని వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ! హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ కౌశిక్‌రెడ్డి వ్యవహారం పార్టీలో కలకలం రేపింది. జరగబోయే ఉపఎన్నికలో తానే టీఆర్‌ఎస్ అభ్యర్థినంటూ బయటకొచ్చిన ఆయన ఆడియోపై పార్టీ సీరియస్ అయింది. రెండుగంటల్లోనే స్పందించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ.. 24…
హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతోందని.. ఎమ్మెల్యేలు, మంత్రులు, వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు రఘునందన్ రావు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ.. ఏడేళ్ల అధికార పార్టీ.. ఒక్క బీసీ నాయకుని తయారు చేసుకోలేక పోయిందని చురకలు అంటించారు. గతంలో దుబ్బాకలో లక్ష మెజారిటీతో గెలిచినట్టు… హుజురాబాద్ మాదే అని ప్రకటనలిస్తున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని నోట్ల కట్టలు వెదజల్లినా ఎవరికి పట్టం…
హుజురాబాద్ లో ఓ ఆడియో టేప్ సంచలనంగా మారింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలకు ఫోన్లు చేసారు. హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫామ్ అయిందని, యూత్ అందరినీ తమ పార్టీ లోకి గుంజాలని కమలాపూర్ మండలం మాధన్నపేటకు చెందిన యువకునితో సంభాషణ జరిపినట్టుగా చర్చ జరిపారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు యూత్ అందరినీ తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్…
కోల్‌బెల్ట్ ఏరియాలో ఆయన పట్టున్న నాయకుడు. వర్గపోరు పడక అప్పట్లో ఉన్న సంఘానికి గుడ్‌బై చెప్పి జాతీయ యూనియన్‌లో చేరారు. మళ్లీ ఏమైందో ఏమో.. సొంత గూటికి తిరిగొచ్చేశారు. ఆయన రాక ఒక సంచలనమైతే.. రీఎంట్రీ వల్ల లాభమా.. నష్టమా అనే చర్చ కూడా మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు మల్లయ్య రీఎంట్రీతో సింగరేణిలో చర్చ! కెంగర్ల మల్లయ్య. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం TBGKS వ్యవస్థాపకుల్లో ఒకరు.…
ఆయనో అధికారపార్టీ ఎంపీ. లోక్‌సభ సభ్యుడిగా ఉండి బోర్ కొట్టిందో ఏమో కొత్తగా ఆలోచిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పార్టీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు టాక్. సమయం చిక్కితే ఆ నియోజకవర్గంలో వాలిపోతున్నారట. ‘హలో.. బాగున్నారా?’ అని కనిపించినవారందరినీ కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏంటా నియోజకవర్గం? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలనే పట్టుదలతో ఉన్నారా? కొత్త ప్రభాకర్‌రెడ్డి. మెదక్ టీఆర్‌ఎస్ ఎంపీ. 2014లో మెదక్…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని రైతు బంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన రైతు బంధు సమితి చైర్మన్,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితతెలంగాణ స్వప్నం సాకారం దిశగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో…
వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు.. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన ఆమె.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం అని ప్రకటించారు.. అయితే, ఇప్పుడు కొత్త కొత్త పార్టీలు వచ్చాయన్నారు హరీష్‌రావు.. గతంలో రాజ శేఖర్ రెడ్డి.. తెలంగాణ సిగరెట్టా..? బీడీనా అని అసెంబ్లీలో అడిగారని.. మా నీళ్లు, నిధులు ఆంధ్రకు తరలిస్తున్నందుకు మీకు మద్దతు ఇవ్వాలా? అని ప్రశ్నించారు.. తెలంగాణ ప్రజల హృదయాల్లో వైఎస్…
హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం, ఎంపి ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ యువజన సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ విప్ భాల్క సుమన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా బాల్క సుమన్ మాట్లాడుతూ… ఆనాడే కమలాపూర్ నియోజకవర్గ టీఆరెస్ కంచు కోట. 2004లో ఎమ్మెల్యే గా ఈటలకు అవకాశం ఇచ్చారు. ఆరు సార్లు పార్టీ బీఫామ్ ఇచ్చి ఆరు సార్లు ఎమ్మెల్యే గా, రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చారు…