నా పైన మావోయిస్టు పార్టీ రాసింది నిజమైన లేఖ కాదు.. అది సృష్టించారు అని అన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు. నేను రైతు బంధు వద్దు అని అనలేదు. ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి మాత్రమే వద్దన్నాను అని స్పష్టం చేసారు ఈటల. పోలీసులు చట్ట బద్దంగా పని చెయ్యాలి. బయటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్ దిన్ కా సుల్తాన్ లు. మీ నియోజకవర్గంలో 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం ఈటల హుజురాబాద్ లో ఇంటినీటి ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.