Kavitha Yatra: నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నాలుగు నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది.
ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా కవిత పీఆర్‌వోను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించినట్లు సమాచారం.
RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు... వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు…
Harish Rao : తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల్లో అర్హతలపై, సమాచారంలో తేడాలు ఉన్నాయని పేర్కొంటూ చక్రధర్ గౌడ్ అనే అభ్యర్థి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌లో, నామినేషన్ దాఖలు సమయంలో హరీష్ రావు తమ ఆస్తుల వివరాలు సరిగా వెల్లడించలేదని, ఈ విషయంలో ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని ఆరోపించారు. Sonam Raghuwanshi: పెళ్లైన 4…
KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంపు కార్యాలయంలో పెట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఘాటు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. కొందరికి గాయాలు కూడా అయ్యాయి.…
తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో పైరవీలు చేయనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఖమ్మంలో 9 మంది గేలిస్తే 3 మంత్రి పదవులు వచ్చాయని తెలిపారు. మరి నల్లగొండలో 11 స్థానాలు గెలుస్తే మంత్రి పదవులు రెండేనా? అన్నారు.
Ponguleti Srinivas : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నిస్వార్థంగా అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇప్పటికీ ప్రజల జీవితాల్లో ఆశాజ్యోతి అన్నారు. రైతన్నలకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వమని, అదే సమయంలో ఆనాటి ప్రభుత్వం రైతుబంధు పథకం గురించి…
జన సమితి కోదండ రామ్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదా? అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వేలంపై ఆయన మాట్లాడారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని... ఈ భూములను కాపాడుతామన్నారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులని గుర్తు చేశారు. ఈ భూములను రాబర్ట్ వాద్రా కోసమే అమ్ముతున్నావా? అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ భర్త కోసమే భూముల అమ్ముతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ దొంగ…
Jagadish Reddy : సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, “రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదు. సీఎం అనే సోయిలేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుంది” అంటూ మండిపడ్డారు. “15 నెలలు గడిచినా కేసీఆర్ ప్రస్తావన లేకుండా సభలు సాగడం లేదు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు,” అని…
Boianapalli Vinod Kumar: హనుమకొండలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎల్కతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభ కొత్త తరానికి కొత్త ఆలోచనలు కలిగించే వేదికగా మారుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా…