గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది.. రాళ్లతో కొట్టడం, ఉరికించి కొట్టడం, చెప్పుల దండలు.. ఇలా ఇప్పుడు లోపల(జైలు)కి పోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చేవరకు వచ్చింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. టి.పీసీసీ చీఫ్ రేవంత్‌పై విరుచుకుపడ్డారు.. ఈ నెల 7వ తేదీ తర్వాత ఎవరు ఏం చేస్తారో తెలుస్తుందన్న ఆయన… రేవంత్ గూండాల మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరు అని వ్యాఖ్యానించారు.. ప్రచారం కోసం రేవంత్ బజారు భాష మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. నీ బెదిరింపులకు భయపడం.. రేవంత్ కంటే ఎక్కువ ఉరికించి కొట్టించగలం అని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి గూండాయిజం చేస్తానంటే లోపలకి పోతావు అంటూ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. రేవంత్ ఒక బ్రోకర్ అంటూ హాట్ కామెంట్లు చేశారు.. సీఎల్పీ మా అబ్బా సొత్తు కాదు.. రేవంత్ అబ్బాసొత్తు కాదు అని సెటైర్లు వేసిన ఆయన.. మేం సీఎల్పీని విలీనం చేసినట్లు ఎప్పుడూ చెప్పలేదన్నారు.. ఒక గ్రూప్ ఎమ్మెల్యేలం టీఆర్ఎస్‌లో విలీనం అయ్యామని తెలిపిన సుధీర్‌రెడ్డి.. లింగోజిగూడలో మేం పోటీ నుంచి తప్పుకున్నాం.. ఒక వేళ పోటీ చేస్తే మేమే గెలిచేవాళ్లమన్నారు.. మరోవైపు.. రేవంత్ ఎంపీగా ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నాడా? అని ప్రశ్నించారు సుధీర్.. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రేవంత్ ప్రజలకు ఏమైనా సహాయం చేసారా ? అని నిలదీశారు.. 2017లో రాజీనామా చేసినప్పుడు స్పీకర్ కు రేవంత్‌రెడ్డి రాజీనామా ఎందుకు ఇవ్వలేదని.. ఎన్నికలకు ఎందుకు వెళ్లలేదని ఫైర్ అయ్యారు.