బ్రేకింగ్: ఎమ్మెల్యే దానంకు 6 నెలల జైలు శిక్ష విధింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… 2015లో జరిగిన ఘర్షణ కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. దానం నాగేందర్‌కు వెయ్యి రూపాయాలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.. 2015లో జరిగిన ఘర్షణ కేసులో ఇవాళ హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ మరియు ఎమ్మెల్యేల స్పెషల్ సెషన్ కోర్టులో విచారణ జరిగింది.. యూ/ఎస్ 323,506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ ప్రకారం బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ పూర్తి చేసిన కోర్టు.. దానం నాగేందర్‌తో పాటు మరోకరిపై నేరం రుజువు అయినట్లు తెలియజేస్తూ యూ/సీ 255(2) సీఆర్‌పీసీ ప్రకారం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించింది.. ఒకవేళ జరిమానా మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఒక్కొక్కరికి 6 నెలల శిక్షను ఖరారు చేసింది కోర్టు.. ఇక, దీనిపై అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.. మరోవైపు ఇదే కోర్టులో తిరుపతి వర్మ అనే న్యాయవాదిని కొట్టిన కేసులో కూడా దానం నాగేందర్ పై మరో కేసు విచారణలో ఉంది.
Also Read
తాజావార్తలు
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!