జహీరాబాద్ టీఆర్ఎస్లో తారాస్థాయికి వర్గపోరు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి.. మాజీ మంత్రికి పడటం లేదట. పెత్తనం కోసం ఇద్దరూ ఫైటింగ్ చేస్తున్నారు. రెండువర్గాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. అదికాస్తా స్థానికంగా అధికారపార్టీలో రచ్చగా మారుతోంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం?
జహీరాబాద్ టీఆర్ఎస్లో మాణిక్‌రావు వర్సెస్ ఫరీదుద్దీన్!
Also Read
మాణిక్‌రావు. ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే. ఇదే నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేత.. మాజీ మంత్రి ఫరీదుద్దీన్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. విభేదాలు తారాస్థాయికి చేరినట్టు పార్టీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ప్రతి విషయంలో మాజీ మంత్రి జోక్యం చేసుకుంటున్నారని రుసరుసలాడుతున్నారట మాణిక్‌రావు. ఎవరైనా అధికారికి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఫలానా పని ఎంతవరకు అయింది అని అంటే… ఫరుదుద్దీన్ సాబ్ ఆ పనిని పెండింగ్‌లో పెట్టమన్నారు అని చెబుతున్నారట. దీంతో ఎమ్మెల్యేకి చిర్రెత్తుకొస్తుందట. మరికొన్ని అంశాల్లో ఫరీదుద్దీన్ కుమారుడు సైతం జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఈ ఆధిపత్యపోరు పార్టీ వర్గాలు రోడ్డున పడి తిట్టుకునే వరకు వెళ్లింది.
ఇద్దరి మధ్య నలిగిపోతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
తమ మద్దతు లేకపోతే మాణిక్‌రావు ఎమ్మెల్యేగా గెలిచేవారా అన్నది మాజీ మంత్రి శిబిరం వేసే ప్రశ్న. ఈ వర్గపోరులో అధికారులతోపాటు.. స్థానిక పార్టీ కార్యకర్తలు.. ప్రజాప్రతినిధులు నలిగిపోతున్నారు. ఎవరి మాట వింటే ఇంకెవరికి కోపం వస్తుందో అని నిత్యం తలపట్టుకుంటున్నారట అధికారులు.
read also : మంత్రినే ఏమారుస్తున్న ఏపీ ఎక్సైజ్‌శాఖ అధికారులు?
నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ అంటోన్న మాణిక్‌రావు
ఫరీదుద్దీన్ గతంలో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009లో జహీరాబాద్ ఎస్సీకి రిజర్వ్‌కావడంతో అంబర్‌పేట్‌కు షిఫ్ట్ అయ్యారు ఫరీదుద్దీన్. 2014 ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి.. కారెక్కేశారు ఈ మాజీ మంత్రి. తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు కూడా. ఇప్పుడా పదవి కూడా ముగిసింది. ఇక మాణిక్‌రావు 2014లో ఓడినా.. 2018లో గెలిచారు. మొన్నటి వరకు మాజీ మంత్రి ఎమ్మెల్సీగా ఉండటంతో నియోజకవర్గంలో మాణిక్‌రావు వర్సెస్ ఫరీదుద్దీన్ అన్నట్టుగా రాజకీయం సాగింది. ఇప్పుడు ఫరీదుద్దీన్ చేతిలో పదవి లేకపోవడంతో.. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్.. పార్టీ అదే స్పష్టం చేసిందని కేడర్‌కు వెల్లడిస్తున్నారు మాణిక్‌రావు. ఆ విధంగా రెండు వర్గాల మధ్య తాజాగా అగ్గి రాజుకుంది.
వెనక్కి తగ్గేలా లేని రెండు వర్గాలు!
టీఆర్ఎస్ కార్యక్రమాల్లో మాణిక్‌రావు, ఫరీదుద్దీన్ కలిసి పాల్గొంటున్నా.. చేతులు కలుస్తున్నాయి కానీ.. నొసటితో వెక్కిరించుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం రెండు వర్గాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ఒకరిపై ఒకరు లీకులు ఇచ్చుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు కేడర్‌ను గందరగోళ పరుస్తున్నాయట. రెండు వర్గాలు వెనక్కి తగ్గే సూచనలు లేకపోవడంతో రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలు.
- Tags
- off the record
- TRS
- Zaheerabad
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!