టి.పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు అంశాలపై స్పందించారు.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అంటున్నాడు.. మరి.. డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండ్ గా…
తెలంగాణ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు అనవసరంగా సీఎం జగన్ పై నిందలు వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసింది మాజీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు జి ఓ 69 తెచ్చి రాయలసీమకు అన్యాయం చేశారు. 800 అడుగులు వద్ద విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు అని తెలిపారు. 254 టీఎంసీలు అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ…
70 ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేళ్లలోనే జరిగిందన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీర సాగర్ గ్రామంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడేళ్ల కేసీఆర్ పాలనలో చేసి చూపించారని తెలిపారు.. యాసంగిలో దేశంలో అత్యధిక వరి సాగు రాష్ట్రంలో జరిగిందన్న ఆయన.. యాసంగిలో 52…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైన జల వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతూనే ఉంది.. ప్రధానికి, కేంద్రానికి, కృష్ణా రివర్ బోర్డుకు తాజాగా ఏపీ లేఖలు రాయడంపై భగ్గుమంటున్నారు తెలంగాణ మంత్రులు, నేతలు.. ఆ విమర్శలపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలంగాణ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయారు.. అక్కడా తెలుగువాళ్లున్నారు… ఇక్కడా తెలుగువాళ్లున్నారని.. బూతులు తిట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ…
ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే పార్టీలోనే ఉన్నా.. ఐక్యత లేదు. అంశం ఏదైనా వీరి మధ్యకు వస్తే రచ్చే. ప్రస్తుతం సింగరేణిలో కార్మిక సంఘం పదవులకు ప్రతినిధుల ఎంపికలోనూ పంతాలకు పోతున్నారట. పెద్దల మధ్య తలదూర్చడం ఎందుకని అనుకున్నారో ఏమో.. ఎంపిక ప్రక్రియను ఆపేశారు యూనియన్ ప్రతినిధులు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్ష పదవుల కోసం టీఆర్‌ఎస్ పోటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో యూనియన్ పదవుల పంపకం వివాదంగా మారింది. TBGKSలో రెండు ఉపాధ్యక్ష పదవుల కోసం అధికారపార్టీ…
రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. కొత్త బిచ్చగాళ్ళు కెసిఆర్ నుంచి గుంజుకునుడే అంటున్నారని.. గుంజుకోవడానికి ఎవని అబ్బ సొత్తు కాదని..వాని అబ్బ సొత్తు అసలే కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూతి లేదు తోక లేదు అన్నట్టు ఉంది రేవంత్ తీరు ఉందన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేసిన వారి పై సైబర్ క్రైమ్స్ విభాగానికి ఫిర్యాదు చేశానని…చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్ తోనే ఉంటానని ప్రకటించారు దానం.…
నాలుగవ తేదీ న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. అందులో హుజూరాబాద్ ఉప ఎన్నిక తో పాటు… రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాల పై చర్చ ఉంటుంది అని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్. హైదరాబాద్ తీవ్రవాదులకు అడ్డాగా మారింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చి అక్రమంగా ఉంటున్నారని మేము చెబుతూనే ఉన్నాం. బోధన్, బైంసా, నల్గొండ, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా దొంగ పాస్పోర్ట్ లతో ఉంటున్నారు. మత కోణంలో వారి…
టీఆర్ఎస్లో ఆ నాయకుడు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారా? ఇప్పుడో.. అప్పుడో అని పదవి ఊరిస్తుంది తప్ప.. ఊరట దక్కడం లేదు. అధినేతతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని కాలం గడిపేస్తున్నారు. ఇప్పటికైనా ఆ అదృష్ట క్షణాలు దగ్గరపడ్డాయా? అధికారపార్టీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత చర్చల్లో లేరు సిరికొండ మధుసూదనాచారి. తెలంగాణ తొలి స్పీకర్. తెలంగాణ రాష్ట్ర సమితి-TRS ప్రారంభం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీ…
సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీపై మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్ కు అభ్యర్థి లేడని…టీఆర్‌ఎస్‌కు డిపాజిట్ గల్లంతు అవుతుందన్నారు. తలకాయ కిందకు, కాళ్లు పైకి పెట్టిన టీఆర్‌ఎస్ పార్టీ గెలవదని..వాళ్ళ పార్టీ నేతలను వాళ్లే కొనుక్కుంటున్నారని చురకలు అంటించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చలేదని మండిపడ్డారు. పోడు భూముల అంశంలో టిఆర్‌ఎస్ రాజకీయం చేస్తుందని బండి…
రాజకీయంగా వారిద్దరూ ఉద్దండులే. ఒకే నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఒకే పార్టీలో ఉన్నారు. ఆధిపత్యం కోసం వారు చేసే పనులు రచ్చ రచ్చ అయిన సందర్భాలు అనేకం. వారి మధ్య మళ్లీ నిప్పు రాజుకుంది. మాటలతో మంట పుట్టిస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? కొత్త రగడ దేనికోసం? లెట్స్ వాచ్! కండువా రంగులు కలిసినా.. మనసులు కలవలేదు తాటికొండ రాజయ్య… టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. మరోనేత కడియం శ్రీహరి… మాజీ ఎమ్మెల్సీ. ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పనిచేసినవారే. రాజకీయ…