ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తన నియోజకవర్గమైన హుజురాబాద్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. ఇప్పుడే ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేకున్నా.. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నాలు చేస్తున్నారు.. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్.. హుజురాబాద్ నియోజక వర్గానికి సంబంధం లేకుండా దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం మొదలు పెట్టారన్న ఆయన.. నా లాంటి వాళ్ళను గుర్తించి ఓటేయ్యాలనుకునే వారి ఓట్లను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ వేడి రాజుకుంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లు ఉండగానే అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసి… కార్యాచరణ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎవరికి వారు… తెలంగాణలో పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీజేపీ షెడ్యూల్ సిద్ధంచేసుకుంది. ఇక షర్మిల కూడా అదే బాటలో నడుస్తుంది. పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి కూడా… తన నడకను మొదలుపెట్టాలని…
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పారు. నూతన జోనల్ విధానానికి అడ్డంకులు తొలగడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇక ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని చెప్పారు. రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న…
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన.. బాబు తన మనుషులకు కాంగ్రెస్‌లో పదవులు ఇప్పిస్తున్నారన్న ఆయన.. చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంధ్రబాబు అని ప్రజలు వెల్లగొట్టారని.. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని…
ఈరోజు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన ఎల్.రమణ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఆర్ఎస్‌లో చేరుతున్నా అని పేర్కొన ఆయన రాష్ట్రప్రగతిలో భాగసౌమ్యం కావాలని అనుకుంటున్నాను అన్నారు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నిన్నవెళ్లి సీఎం కేసీఆర్ ను…
తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయం అయింది. ఈరోజు సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎల్.రమణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ… ‘ఎల్.రమణ అంటే కేసీఆర్‌కు అభిమానం అంటూ చెప్పుకొచ్చారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ తెరాసకు అవసరమన్నారు. రమణను తెరాసలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. రమణ సానుకూలంగా స్పందించారని…
కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ ఎంపీ , టిపిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ… సోనియాగాంధీ , రాహుల్ గాంధీ ప్రోత్సహంతో తెలంగాణ రాష్టానికి 6 సంవత్సరాలపాటు పిసిసి అధ్యక్షులుగా సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. కొన్ని సంవత్సరాలుగా వివిధ పార్టీల వారు మా కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న ప్రతి కాంగ్రెస్…
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.. తర్వాత ఆ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ దిగినా.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ నుంచి అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి.. ఇక, నిన్న గాంధీ భవన్ వేదికగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్.. ముఖ్యంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని టార్గెట్ చేశారు.. అయితే, మధు…
కేసీఆర్‌పై ఆరోపణలు, విమర్శలు చేసి గెలవాలంటే అది సాధ్యం కాదని.. కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమిస్తేనే అది సాధ్యమంటూ సలహా ఇచ్చారు మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో ఇవాళ సింగరేణి బీఎంఎస్ ప్రిసెడెంట్ మల్లయ్య.. టీఆర్ఎస్‌లో చేరారు.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సందర్భంగా విపక్షాలపై సెటైర్లు వేశారు.. మార్కెట్ లోకి కొత్త బిచ్చగాళ్ల వచ్చారు… వాళ్లు ఎవరో మీకు తెలుసన్నారు.. నిన్న మొన్న పదవులు…
తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్. రమణ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్‌ను రమణ కలవనున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ పనిచేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ మరుగున పడటం, ఆ పార్టీతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఇలా పలు కారణాల వల్ల…టీఆర్‌ఎస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు ఎల్. రమణ. అయితే… టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎలాంటి హామీలు వచ్చాయే తెలియాల్సి ఉంది. read also : తెలంగాణలో…