తెలుగు నేలపై పాదయాత్రలు కొత్త కాదు.. పాదయాత్రలు నిర్వహించి సీఎంలు అయినవారు ఉన్న నేల ఇది.. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి మహాపాద యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారాయన.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర నిర్వహిస్తాన్న ఆయన.. భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి పాదయాత్రను ప్రారంభించి హుజురాబాద్ వరకు నడవనున్నట్టు…
హుజురాబాద్ బీజేపీ పార్టీ విజయం సాధించబోతుందని..ఎవరు వచ్చినా ఈటల రాజేందర్ గెలుపును ఆపలేరని పేర్కొన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరా బాద్ ఉప ఎన్నిక కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అధికార పార్టీకి అసలు అభ్యర్థి దొరకడం లేదని.. పొర్లు దండాలు పెట్టిన అక్కడ గెలిచేది బీజేపీనేనని స్పష్టం చేశారు. అడ్డదారిలో టీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్……
సూర్యాపేట జిల్లా : బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల పై బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని…తెలంగాణ హాక్కులను కేంద్రానికి దారాదత్తం చేయాలనట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య విభేదాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తోందని…రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను కేంద్రం పరిష్కరించడంలేదన్నారు. నదీ జలాలను న్యాయంగా వాడుకోవడం పై జగన్ కి ఎంతో వివేకంతో కేసీఆర్ స్పష్టం చేసారని.. గోదావరి నది…
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కొత్త పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం.. దానికి కౌంటర్‌గా ఆ ఎమ్మెల్యేలు ఎదురు దాడిగి దిగడం జరిగిపోయాయి.. మీరు రాళ్లు విసిరితే.. మేం చెప్పులతో కొడతామంటూ హాట్ కామెంట్లు చేశారు పార్టీ వీడిన ఎమ్మెల్యేలు.. అయితే, ఆ వ్యాఖ్యలపై మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక్కడు కూడా మంత్రి వర్గంలో లేరన్న ఆయన.. తెలంగాణ ద్రోహులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు.. ఎర్రబెల్లి,…
బీజేపీలో ఈటల చేరికతో రుసరుసలాడుతోన్న ఆ కమలనాథుడు.. పార్టీతో తెగతెంపులు చేసుకోబోతున్నారా? పక్కచూపులు చూస్తున్నారా? కమలానికి గుడ్‌బై చెప్పడమే మిగిలిందా? ఇంతకీ ఎవరా నాయకుడు? రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? బీజేపీకి గుడ్‌బై చెప్పబోతున్నారా? బీజేపీలో కొత్తగా చేరిన వెటరన్స్ పక్కచూపులు చూస్తున్నారట. పార్టీ నుండి జారుకునేందుకు మార్గాలు వెతుకుతున్నట్టు సమాచారం. ఈ జాబితాలో మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఆయన కమల పార్టీని వదిలేసినట్టేనని బీజేపీ వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చాయట.…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇక, సీఎం పర్యటనను మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన నిన్ననే పర్యటించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అన్ని కార్యాలయాలను సందర్శించారు. పలు సూచనలు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరనున్నా సీఎం…
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు తూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. read also : తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం : సీఎం కేసీఆర్ అయితే..…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ ఫైర్ అయ్యారు. వివాదాల మధ్య రేవంత్.. పిసిసి అధ్యక్షుడయ్యాడని…రేవంత్ రాజకీయ ఎదుగుదల వివాదాస్పదమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం లో రాళ్లతో కొట్టాలని ఉందా.. అలా మాట్లాడితే చట్ట ప్రకారం శిక్షించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిషేధించిన మావోయిస్టు పార్టీలో ఉండే వాళ్ళలా రేవంత్ మాట్లాడుతున్నారని.. రాజస్థాన్ లో ఆరుగురు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని చురకలు అంటించారు. read also : తెలంగాణలో…
పోడు భూముల సమస్య అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు తలపోటుగా మారింది. సీజన్ వస్తే చాలు.. అటవీ అధికారులతో లడాయి తప్పడం లేదు. ఆగ్రహావేశాలు.. దాడులు.. ఉద్రిక్తతలు రొటీన్ అయిపోయాయి. సమస్యను రాజకీయం చేయడానికి విపక్షాలు చూస్తుండటంతో మరింత టెన్షన్ పడుతున్నారట టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు. శాంతిభద్రతల సమస్యగా పోడు భూముల రగడ అటవీ అధికారులు.. గిరిజనులకు మధ్య పోడు భూములపై రగడ పాతదే. కానీ.. ఎప్పటికప్పుడు కొత్తగా తెరపైకి వస్తుంది. అడవినే నమ్ముకున్న తాము పోడు వ్యవసాయం చేసుకుంటే తప్పేంటని…
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ అని.. రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మేము సేవా రాజకీయాల్లో ఉన్నామని.. గతంలో రాజీనామా చేసి, స్పీకర్ కు రాజీనామా ఇవ్వలేదు ఎందుకు ? అని నిలదీశారు. మీరు రాళ్లతో కొడితే… మేం చెప్పులతో కొడతామని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు సుధీర్ రెడ్డి. read also : నడి…