తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్నది. వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకొని టీఆర్ఎస్‌ను ఢీకొట్టాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే త్వరలో బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకూ తొలివిడత పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆగస్టు 9 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read: రేవంత్‌రెడ్డి ఫైర్.. ఊర్లకు వస్తే ఉరికించి కొడతాం..!
వారం క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ చేతిలో ఉండేదని, కానీ ఇప్పుడు, ఆ పార్టీని టీడీపీ నడిపిస్తోందని తరుణ్ చుగ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీకాలను ప్రజల వరకు చేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా బీజేపి పనిచేస్తుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని గ్రామాలకు వెళ్లె యాత్ర ప్రారంభిస్తున్నట్టు తరుణ్ చుగ్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి సంజయ్ పాదయాత్రతో మొదటి అడుగు పడుతుందని తరుణ్ చుగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.