గాంధీభవన్ లో ప్రారంభమైన టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశం పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుసేన్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, రమేష్ ముదిరాజ్, నిరంజన్, వేం నరేందర్ రెడ్డి, కుమార్ రావ్, సురేష్ కుమార్ షెట్కార్, జఫ్ఫార్ జవీద్, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
తెలంగాణకు ఉప ఎన్నిక ఫీవర్ పట్టుకుంది. ఒక నియోజకవర్గం కోసం యావత్ రాష్ట్ర పాలనా యంత్రాంగం హుజూరాబాద్‌ని చుట్టేస్తోంది. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే నెలకొని వుంది. కానీ మధ్యలో కాంగ్రెస్ నేతలు కూడా మేమున్నాం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈటల నిజంగానే ప్రజలకు సేవ చేసి ఉంటే ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అధికార పార్టీకి…
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల్లో జానారెడ్డి ఒకరు. కొన్ని దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన ఆపార్టీని ధిక్కరించిన దాఖలాల్లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఆయనకు ఏదో ఒక మంత్రి పదవీ దక్కేది. అత్యధిక కాలం మంత్రిగా పని చేసిన రికార్డు సైతం జానారెడ్డి పేరు పైనే ఉంది. తెలంగాణ కోసం పోరాడిన నేతగానూ ప్రజల్లో ఆయనకు గుర్తింపు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో…
ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ధ భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులంటా దిల్‌షుఖ్ నగర్ రావాలని, దిల్‌షుఖ్ నగర్ లో సాయంత్రం 4 గంటల నుంచి ఎలాగైనా ర్యాలీని చెపట్టితీరుతామని రేవంత్ ప్రకటించారు. ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. కట్టుదిట్టమైన…
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపగా.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి… గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ సారి 60 వేల ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ…
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల హీట్ పెరిగిపోతోంది.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతుండగా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇక, గత ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై ఫోకస్ పెట్టింది… ఇప్పటికే పలు దఫాలుగా హుజురాబాద్ ఉప ఎన్నికలపై చర్చించింది టి.పీసీసీ.. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని భావిస్తోంది..…
ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తుఫాన్, భారీ వర్షాల వరదల నష్టాల అంచనాలకు నియోజక వర్గాలకు ఐఏఎస్ అధికారులను పంపించండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పల్లెలు పట్టణాలు, నగరాలు అతులాకుతలం అవుతున్నాయి. రాష్ట్రంలో పంటలు, ఇళ్ళు, రోడ్లు, చెరువులు, కాలువలు నష్టాలకు గురవుతున్నాయి. భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయి, ఇళ్లు కూలిపోయి ప్రాణ…
కొత్త పీసీసీ చీఫ్, కొత్త కమిటీలను నియమించిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అలా అనీ మొత్తం కార్యక్రమాలకు దూరంగా ఉండడం లేదు.. ఆయన నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ, పార్టీ సమావేశాలకు, సభలకు దూరంగా ఉంటున్నారు. ఇక, అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాను…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్ల పాలనపై ప్రచా చార్జిషీట్ పేరుతో ఓ పత్రాన్ని విడుదల చేసింది టి.పీసీసీ.. దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారికి నష్టం కలిగించారంటూ.. ఆ చార్జిషీట్‌లో సీఎం కేసీఆర్‌ను ఏ1గా చేర్చారు.. ప్రజాకోర్టులో నెంబర్ 1 దోషి కేసీఆర్‌కు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగంపైన ప్రమాణం చేసి తాను ప్రజలకు మాట ఇచ్చి మోసం చేయడం నేరం. .అందుకే కేసీఆర్ నేరస్థుడు…
కాంగ్రెస్ పూర్వీకుల ఆస్తిని బీజేపీ దొంగతనం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. గాంధీ భవన్లో జెండా ఎగరేసిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ స్వతంత్ర పోరాటానికి అప్పటి ప్రధాని నెహ్రూ సహకరించారని తెలిపారు.. హోంమంత్రికి ప్రత్యేక నిర్ణయాలు ఉండవు.. ఆపరేషన్ పోలో నిర్ణయం నెహ్రూదేనని స్పష్టం చేశారు.. కానీ, కొందరు ఇది హోం మంత్రి నిర్ణయంగా చిత్రీకరిస్తున్నారన్న ఆయన.. కాంగ్రెస్ పూర్వీకుల…