తెలంగాణ కాంగ్రెస్‌లో హైకమాండ్ వేసిన PAC ఏం చేస్తుంది? ఇప్పటి వరకు PCC నిర్వహిస్తున్న సమావేశాలకు.. PACకి తేడా ఏంటి? కొత్త కమిటీనే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుందా.. లేక PAC ఉత్సవ విగ్రహంగా మారుతుందా? కాంగ్రెస్ పీఏసీ రాజకీయ నిర్ణయాలు చేస్తుందా? ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ రగులుతూనే ఉండటం తెలంగాణ కాంగ్రెస్‌లో కామన్. పార్టీలో చాలా మంది సీనియర్లకు పీసీసీ కొత్త కమిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం లేదనే చర్చ ఉంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ…
తెలంగాణలో సెప్టెంబర్ 17 హీట్ మొదలైంది. అదేరోజు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భారీ సభలకు రెడీ అవుతున్నాయి. విమోచన దినం పేరుతో కమలనాథులు.. ఆత్మగౌరవ సభ పేరుతో గజ్వేల్‌లో కాంగ్రెస్ ఫోకస్‌పెట్టాయి. మరి.. టీఆర్‌ఎస్ ఆలోచన ఏంటి? అధికారపార్టీ ఏం చేయబోతోంది? తెలంగాణలో సెప్టెంబర్ 17 వేడి! ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తుంది అంటే తెలంగాణలో పొలిటికల్‌గా హాట్ హాట్ చర్చ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 17 పై రాజకీయ పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.…
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీ వచ్చేసింది. ఈ కమిటీ అయినా నాయకుల మధ్య సమన్వయం సాధిస్తుందా? అలిగిన ఆ ఇద్దరు నాయకులు గాంధీభవన్ మెట్లు ఎక్కుతారా..!? కథ సుఖాంతం అవుతుందా.. లేదా? రేవంత్‌ను వ్యతిరేకించిన ఎంపీ కోమటిరెడ్డికి పీఏసీలో చోటు! తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులు అందరినీ కలిపేందుకు AICC ఓ కసరత్తు చేసింది. 30 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేసింది. ఈ కమిటీలో ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు మాజీ పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలకు చోటు…
ఇందిరా గాంధీ స్ఫూర్తితో గజ్వేల్‌లో దండోరా సభ నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… గాంధీ భవన్‌లో జరిగిన పీపీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. గజ్వేల్ సభకి సర్వాధికారాలు గీతక్క(గీతారెడ్డి)కే ఉంటాయని.. ప్రతీ గ్రామంలో దండు కట్టి… దండోరా మోగించాలన్నారు. ఇక, గజ్వేల్ సభతో అంతకం కాదన్నారు రేవంత్ రెడ్డి.. గజ్వేల్ కోటను కొల్ల గొడితేనె.. సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు.. కో-ఆర్డినేటర్‌లు కష్టపడండి.. కష్టపడిన వారికే పదవులు, గుర్తింపు వస్తాయన్నారు. గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని…
గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి జరుగుతున్న కృషి అభినందనీయమన్న ఆయన.. అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుందన్నారు.. అందరూ ఐక్యమత్యంతో కలిసి పనిచేసి… తెలంగాణకు కాంగ్రెస్ మాత్రమే దిక్సూచి అని నిరూపించాలని సూచించారు. దీనికోసం నా వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు జానారెడ్డి.. ఇక, అడుగడుగున పిలిస్తే నేను రాలేదు అని అనుకోకండి.. మీరు ఏదైనా…
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గుజ్జుల మహేష్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ చీఫ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతుంది.. ఏదో చేస్తాడని రెండు సార్లు కేసీఆర్‌ను సీఎంను చేస్తే.. ఏమీ చేయకుండా కుటుంబ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములు కట్టబెట్టారు.. ఆంధ్ర కాంట్రాక్టర్లకు…
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పోలికల్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా గత కొంతకాలంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో ఈ రెండు పార్టీలు తెగ హడావుడి చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పార్టీలు జనసమీకరణపై దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ రెండు పార్టీలు సెప్టెంబర్…
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వీరికి బయటి శత్రువుల కంటే లోపటి శత్రువులే ఎక్కువ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతుంటారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ ను ఈదలాంటే చిన్నచిన్న చేపలు బలి కావాల్సిందనేలా ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి అంటే నేతలంతా సీఎం పదవితో సమానంగా చూస్తుంటారు. దీని కోసం నేతల మధ్య కుస్తీలు మామూలుగా ఉండవు. ఈ విషయం మొన్నటి టీపీసీసీ చీఫ్ నియామకంతో…
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఢిల్లీ టూర్‌లో అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటా? సీనియర్లు వేసిన స్కెచ్‌కి.. పార్టీ ఇంఛార్జ్ చెక్ పెట్టారా? దళిత దండోరా సభకు రాహుల్ వస్తా అన్నా.. వద్దని చెప్పింది ఎవరు? ఇంతకీ రాహుల్‌తో భేటీలో ఏం జరిగింది? లెట్స్ వాచ్! రాహుల్‌తో వన్ టు వన్ భేటీ లేకపోవడంతో నేతలు ఉస్సూరు! తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు చాలారోజుల తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దక్కింది. 45 నిమిషాలపాటు పీసీసీ కొత్త టీమ్ సమావేశమైంది. సీనియర్ నాయకులతో…
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ కుటుంబం.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత పొందింది. తర్వాత టీఆర్ఎస్ లోకి రావడం.. చివరికి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరడం.. ఇలా ఐదారేళ్లుగా వారి రాజకీయం చుక్కాని లేని నావలా ముందుకు పోతోంది. ఇలాంటి తరుణంలో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో వారిని ఓ అవకాశం తలుపు తట్టి మరీ పిలుస్తోంది. ఈ విషయమై.. కొండా సురేఖ కుటుంబం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన పొరబాట్లు, రాజకీయంగా చేసిన…