గాంధీభవన్ లో ప్రారంభమైన టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశం పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుసేన్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, రమేష్ ముదిరాజ్, నిరంజన్, వేం నరేందర్ రెడ్డి, కుమార్ రావ్, సురేష్ కుమార్ షెట్కార్, జఫ్ఫార్ జవీద్, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ప్రధానంగా నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబెర్ షిప్ ప్రోగ్రోమ్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. నవంబర్ 14వ తేదీ నుంచి జరగనున్న జన జగరణ కార్యక్రమాల గురించి చర్చలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోలు పై భవిష్యత్ కార్యచరణను ప్రకటించే అంశంపై చర్చించనున్నారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఉప ఎన్నిక బైపోల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.