మళ్లీ ఘాటుగా స్పందించిన కోమటిరెడ్డి.. షో రాజకీయాలు చేయలేను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త పీసీసీ చీఫ్, కొత్త కమిటీలను నియమించిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అలా అనీ మొత్తం కార్యక్రమాలకు దూరంగా ఉండడం లేదు.. ఆయన నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ, పార్టీ సమావేశాలకు, సభలకు దూరంగా ఉంటున్నారు. ఇక, అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పుకొచ్చారు.
ఇక, నాకు షో రాజకీయాలు తెలియవు అని వ్యాఖ్యానించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రెండేళ్లలో ఎన్నికలు వస్తుంటే ఇలాగేనా పార్టీ సన్నద్ధత అంటూ ఫైర్ అయిన ఆయన.. అందుకే పొలిటికల్ అఫైర్స్ మీటింగ్‌కి వెళ్లడంలేదని స్పష్టం చేశారు. ఇక, సీనియర్లను సంప్రదించకుండా అధికార ప్రతినిధులను నియమిస్తారా? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి.. వచ్చేవారం రాహుల్ గాంధీ, ప్రియాంకతో ఈ విషయాలను చర్చించనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలి.. అప్పుడే గెలుస్తుందన్నారు.. ఇక, హుజురాబాద్ ఖాళీ అయ్యి నాలుగున్నర నెలలు అయ్యిందని.. కొత్త పీసీసీ వచ్చి మూడున్నర నెలలు అయినా.. ప్రధాన ప్రతిపక్షం ఎందుకు రివ్యూ చేయట్లేదు అని ప్రశ్నించారు కోటమిరెడ్డి. పీసీసీ నేతలు హుజురాబాద్ ఎందుకు వెళ్లరు? అని నిలదీశారు. పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… హుజురాబాద్‌లో మూడు ఎన్నికల్లో 50, 60 వేల ఓట్లు వచ్చాయని.. అందరం కలిసి పనిచేస్తే మరో 50 వేల ఓట్లు రావా? సీనియర్లను ఇంఛార్జ్‌లుగా పెట్టి వారానికి ఒక్కసారి సమావేశాలు పెడితే గెలవదా? అని ప్రశ్నించారు. జీరోగా ఉన్న దుబ్బాకలో 23 వేల ఓట్లు తెచ్చుకున్నామని గుర్తుచేసిన కోమటిరెడ్డి.. హుజురాబాద్‌లో ఫైట్ జరుగుతుంటే.. దానిని కాంగ్రెస్ వదిలేస్తే.. అర్థం ఏంటి..? అని ప్రశ్నించారు. హుజురాబాద్ యుద్ధానికి ముందే చేతులు ఎత్తేస్తామా? అని ప్రశ్నించిన ఆయన అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని తవెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?