తెలంగాణకు ఉప ఎన్నిక ఫీవర్ పట్టుకుంది. ఒక నియోజకవర్గం కోసం యావత్ రాష్ట్ర పాలనా యంత్రాంగం హుజూరాబాద్‌ని చుట్టేస్తోంది. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే నెలకొని వుంది. కానీ మధ్యలో కాంగ్రెస్ నేతలు కూడా మేమున్నాం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈటల నిజంగానే ప్రజలకు సేవ చేసి ఉంటే ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే, మంత్రులు… ఎమ్మెల్యే లందరినీ హుజూరాబాద్‌కు ఎందుకు పంపారని భట్టి ప్రశ్నించారు. ఈటలకు నిజాయితీ ఉంటే… ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు కదా..? అని అన్నారు. నీ దోపిడీ రక్షణ కోసమే ఢిల్లీ కి వెళ్లి బీజేపీ లో చేరావని, కాంగ్రెస్ కి డిపాజిట్ రాదని చెప్పే కేటీఆర్ వందల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరినీ ఇక్కడ పెట్టి ఎందుకు ప్రచారం చేస్తున్నారని భట్టి అన్నారు. బీజేపీ సహజంగానే బడుగుల వ్యతిరేకి అనీ, దళిత బందు బీజేపీ లేఖ రాసి అపించి ఉండొచ్చు..ఇది కొత్త ఏం కాదు అన్నారు.
కానీ టీఆర్‌ఎస్‌కి పాత పథకం…దీన్ని కంటిన్యూ ఎందుకు చేయలేక పోయిందన్నారు. రైతు బంధు కోసం 2018లో ముందస్తు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నారని, ఇప్పుడు కూడా దళిత బంధు అమలుకు ఎందుకు ఎన్నికల కమిషన్ కి లేఖ రాయలేదని భట్టి విక్రమార్క విమర్శించారు.