ఏడేళ్ల టీఆర్‌ఎస్ పాలనపై చార్జిషీట్.. ఏ1గా సీఎం కేసీఆర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్ల పాలనపై ప్రచా చార్జిషీట్ పేరుతో ఓ పత్రాన్ని విడుదల చేసింది టి.పీసీసీ.. దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారికి నష్టం కలిగించారంటూ.. ఆ చార్జిషీట్‌లో సీఎం కేసీఆర్‌ను ఏ1గా చేర్చారు.. ప్రజాకోర్టులో నెంబర్ 1 దోషి కేసీఆర్‌కు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగంపైన ప్రమాణం చేసి తాను ప్రజలకు మాట ఇచ్చి మోసం చేయడం నేరం. .అందుకే కేసీఆర్ నేరస్థుడు అని పేర్కొంది కాంగ్రెస్ పార్టీ.. కేసీఆర్ సీఎం అయ్యి ఏడున్నర ఏళ్లు అయ్యింది. 2014 ఎన్నికల ముందు దళిత, గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించిన కాంగ్రెస్. 2014 నుంచి ఇప్పటి వరకు సీఎంగా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చినా అవి అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించింది. హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు.. కానీ, అమలు చేయరని పేర్కొన్న కాంగ్రెస్.. కేసీఆర్ హామీలు నెరవేర్చినట్టు అయితే.. దళిత, గిరిజనులకు ఎంతో లాభం జరిగేది. వాళ్లు ఆత్మగౌరవంతో దర్జాగా బతికేవాళ్లు.. ఏడున్నర ఏళ్లలో లక్షలాది దళిత, గిరిజన కుటుంబాలకు భరోసా కలిగేదన్నారు.. ఇవాళ అవన్నీ జరగకపోవడానికి దళిత, గిరిజనులు ఇంకా అలాగే ఆత్మన్యూనతతో బతుకీడుస్తున్నారు. అందుకు కేసీఆరే దోషి.. అని.. తెలంగాణ ప్రజల పక్షాన చార్జిషీట్ విడుదల చేస్తున్నామని పేర్కొంది.
ఇక, కేసీఆర్ నేరాల చిట్టను కూడా పొందుపర్చింది కాంగ్రెస్ పార్టీ.. 1. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని ప్రకటించి విస్మరించడం నేరం కాదా?, 2. భూమి లేని ప్రతీ దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం నేరం కాదా?, 3. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానన్న హామీ అమలు చేయకపోవడం నేరం కాదా?, 4. నియామకాలే నినాధంగా సాగి రాష్ట్రాన్ని సాధించిన నిరుద్యోగులను నిండా ముంచడం నేరం కాదా?, 5. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం నేరం కాదా?, 6. ఎస్టీ, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల హామీ అమలు చేయకపోవడం నేరం కాదా?, 7. కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్యా విధానాన్ని నీరు గార్చడం నేరం కాదా?, 8. అమలుకు ఆమడ దూరంలో ఫీజు రీయంబర్స్మెంట్ నేరం కాదా?, 9. దళిత గిరిజనులపై హత్యలు, అత్యాచారాలు అడ్డుకోకపోవడం నేరం కాదా?, 10. ఆర్థిక సహకార సంస్థలు దళిత, గిరిజనులను ఆదుకోకపోవడం నేరం కాదా? అంటూ ఆరోపణలు గుప్పించింది.. ఇక, ప్రజాకోర్టులో దోషిగా నిరూపించి ప్రజల చేత శిక్షిస్తాం… ప్రజా దండు కడతాం దళిత, గిరిజన దండోరా మోగిస్తాం.. కేసీఆర్ గుండెల్లో దడ పుట్టిస్తాం.. ప్రజా తెలంగాణ నిర్మిస్తాం అంటూ టి.పీసీసీ ప్రచార కమిటీ ప్రకటించింది.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!