మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ మరియు మండల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 78 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, అక్రమ కేసులపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, అరాచకాలపై నవంబర్ 14 వ తేదీ నుంచి 21 వరకు 7 రోజుల పాటు నారాయణ పేటలో జన జాగరణ పేరుతో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఇక నవంబర్ 1 వ తేదీ గాంధీ భవన్ లో నుంచి డిజిటల్ మెంబర్ షిప్ నమోదు కార్యక్రమం ప్రారంభం అయ్యింది.