రేవంత్‌కి ఎమ్మెల్యే సవాల్.. ఒక్క ఓటు పెరిగినా నేను, నా భార్య రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపగా.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి… గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ సారి 60 వేల ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు. ఇక, రేవంత్ రెడ్డి పోటీ చేసినా సరే- ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ నిలబడ్డా ఒకే.. గత ఎన్నికల కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా నేను – నా భార్య.. మా పదవులకు రాజీనామా చేస్తాం అని ప్రకటించారు గండ్ర.. మరోవైపు, సత్యనారాయణ నక్సలైట్లకు సానుకూలంగా ఉన్నది మర్చిపోవద్దన్న ఆయన.. రోజుకో పార్టీ మార్చే సత్యనారాయణకు నా గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు.. నా గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడినందుకు రేపు పరువునష్టం కేసు వేస్తానంటూ హెచ్చరించారు.
Also Read
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!