తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నారా? జిల్లాలకు కొత్త నాయకత్వం రాబోతుందా? పీసీసీ చీఫ్ ఆలోచనేంటి? ఉన్న వాళ్లందరినీ మర్చేస్తారా? పదవులను కట్టబెట్టేందుకు ప్రామాణికంగా భావిస్తున్న అంశాలేంటి? జనవరి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు..! తెలంగాణ కాంగ్రెస్‌కి పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై ఎక్కువ చర్చ జరిగింది. ఎవరెవరు టీంలో ఉంటారు. ఎవరిని బయటకు పంపిస్తారు అని ఆరా తీశారు. రేవంత్ భారీ సభలు.. కార్యక్రమాలపై ఫోకస్ పెట్టడంతో రాష్ట్ర…
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా..? అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది… లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంపై ఇవాళ పీఏసీ సమావేశమై చర్చింది.. అయితే, పోటీపై ఎలాంటి నిర్ణయానికి రానట్టుగా తెలుస్తోంది.. ఇక, నల్గొండలో పోటీ చేయాలా..? వద్దా..? అనేది జిల్లా నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి తెలిపినట్టుగా సమాచారం.. మరోవైపు..…
ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ లో కొంత గ్రూప్ వార్ నడిచిన విషయం తెలిసిందే. నాయకులూ రెండు గ్రూపులుగా విడిపోయి మరి విమర్శించుకున్నారు. కానీ ఇప్పుడు అంత సద్దుమణిగినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా సమావేశంలో హుజరాబాద్ ఎన్నికల ఫలితం, సంబంధిత ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది అని సి.ఎల్.పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పోరాడుతాం అని తెలిపారు. 2023 ఎన్నికలకోసం “యాక్షన్ ప్లాన్” సిధ్దం…
కాంగ్రెస్ వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతల పోటికల్ వార్ జరిగింది. రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ నేతలు… ఓ పక్క రేవంత్ వర్గం … మరోవైపు ఉత్తమ్ వర్గంగా చీలారు నేతలు. పొన్నం ప్రభాకర్… ఉత్తమ్ మద్య మాటల యుద్ధం జరిగింది. కొందరు తెరాసకి కోవర్తులుగా పని చేశారన్నారు పొన్నం. కౌశిక్ రెడ్డీని పెంచి పోషించింది ఉత్తమ్. ఈటల ఎపిసోడ్ లో పార్టీ స్టాండ్ ఏంటని ఉత్తమ్ నీ అడిగా ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు.…
తెలంగాణ కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్ కామన్. ప్రతి నాయకుడు….తనకు కావలసింది సాధించుకోవడం కోసం వ్యూహాలు వేస్తుంటారు. ఇటు కోమటిరెడ్డి నుంచి మొదలుకుని…ప్రేమ్ సాగర్ వరకు…ఎవరి వ్యూహం వారికి ఉంది. మరి…అదిలాబాద్ పంచాయితీ వెనక అసలు వ్యూహం ఏంటి!? అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది?మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు…మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మద్య పంచాయుతీనే రచ్చకు కారణం అవుతుందా?మహేశ్వర్ రెడ్డి…ఇంద్రవెల్లి సభ కంటే ముందు రచ్చ చేశారనే…ప్రేమ్‌సాగర్ వివాదం మొదలైందా?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. ప్రేమ్…
ప్రాంతీయ పార్టీల ఏకైక సిద్ధాంతం అవకాశవాదం మాత్రమే అన్నారు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2023 లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం దాచుకోవడం.. దోచుకోవడం. మహాత్మా గాంధీని చంపింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లే. నెహ్రూను తక్కువచేసి చూపించేందుకు బీజేపీ సావర్కర్ ను తెరపైకి తీసుకు వస్తుందన్నారు ఉత్తమ్. ఒక్క సంతకంతో దేశం మొత్తం రైతు రుణమాఫీ చేసిన చరిత్ర…
ఈ నెల 9, 10 తేదీల్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు ఉంటాయని టీపీసీసీవర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.డిజిటల్ సభ్యత్వ నమోదుపై డీసీసీలకు, నియోక జవర్గం నుంచి ఒకరికి శిక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రెండు రోజు ల పాటు కొంపల్లిలో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఈ మేర కు ఏర్పాట్లను మహేష్ గౌడ్ తోపాటు సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేం దర్ రెడ్డి, అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డీ పరిశీలించారు. అనంతరం…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. అది దక్కించుకోలేకపోయారు పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకర్‌రెడ్డి, మరోవైపు.. ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టేస్తుంటారు.. ఇక, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. టి.పీసీసీ.. కోమటిరెడ్డి మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో తాను మాట్లాడుతా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత,…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గౌరప్రదమైన ఓట్లు రాగా.. ఈ ఎన్నికల్లో మాత్రం చెప్పుకోదగిన ఓట్లు రాబట్టలేకపోయింది.. అయితే, ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది.. ఉప ఎన్నికల ఫలితాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్నే రేపుతున్నాయి.. ఆ ఇద్దరు నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ మరియు మండల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 78 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, అక్రమ కేసులపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ,…