ఏ పార్టీకైనా అధికార ప్రతినిధులు బలం. విమర్శలు వచ్చినా.. సమస్యలపై స్పందించాలన్నా.. వాళ్ల పాత్ర కీలకం. కానీ.. ఆ జాతీయపార్టీలో స్పోక్‌పర్సన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవట. డజను మందికిపైగా అధికార ప్రతినిధులున్నా పార్టీ వాయిస్ లేదు..! తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక వేసిన పార్టీ పదవులు అధికార ప్రతినిధుల పోస్టులే. పార్టీకి అధికార ప్రతినిధుల పాత్ర కీలకమని భావించి వాటిని ప్రకటించారు. కాంగ్రెస్ వాయిస్ వినిపించడం.. సమస్యలపై పూర్తి అవగాహనతో స్పందిస్తారని…
తెలంగాణలో రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం నాటకలాడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ అనుబంధ సంఘాలన్నిటితో సమావేశం జరిగిందని, ఈ రోజు డిజిటల్ మెంబర్షిప్ తో పాటు భూ వివాదాలపై పాదయాత్ర పై చర్చించాం అన్నారు మహేష్ కుమార్ గౌడ్. భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర లోని సేవాగ్రాం వరకు పాదయాత్ర జరగనుంది. జనవరి 30 నుంచి పాదయాత్ర ను మీనాక్షి నటరాజన్ చేయనున్నారు. ఈ పాదయాత్ర లో ఒక్క రోజు…
30 లక్షలు టార్గెట్. ఆ అంకె వినగానే గుండె గుభేల్ మన్నా.. సవాల్‌గా తీసుకుని టార్గెట్ చేరుకోవాలని అనుకున్నారు నాయకులు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి రివర్స్. చీమ కుట్టినట్టు అయినా లేదట. పార్టీ చేపట్టిన కార్యక్రమానికి ఊ అంటారో.. ఊహూ అంటారో కూడా తెలియని పరిస్థితి ఉందట. సభ్యత్వం నమోదు కోసమే 30 మందికి శిక్షణ..! కొత్త నాయకత్వం రాగానే సభలు.. సమావేశాలు అని ఊదరగొట్టిన తెలంగాణ పీసీసీకి 30 లక్షల సభ్యత్వం నమోదును లక్ష్యంగా పెట్టింది…
ఊహాగానాలకు తెరదించారు ఆ సీనియర్ పొలిటీషియన్. మళ్లీ పాత గూటికే వెళ్తున్నారు. రీఎంట్రీ వెనక కీలక లెక్కలే ఉన్నాయట. భారీ అంచనాలు వేసుకుని.. పైవాళ్ల దగ్గర ఓ మాట అనేసుకుని.. జాయినింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన వేసుకున్న లెక్కలేంటి? కాంగ్రెస్‌లోకి తిరిగి ఎందుకొస్తున్నారు? ధర్మపురి శ్రీనివాస్. ఇలా పూర్తి పేరుగా కంటే.. DS అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీతో ప్రయాణించిన ఆయన.. తెలంగాణ…
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హస్తిన పర్యటన వాయిదా పడింది.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో జరగాల్సిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ రద్దు అయ్యింది. మరోవైపు రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్.. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుచరులతో సమావేశమై చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నారు. మొత్తంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత తిరిగి కాంగ్రెస్…
గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు బలగం ఉంది. అలాంటిది బరిలో ఉండకుండా కాడి పడేశారు. రాజకీయంగా ఎత్తులు.. జిత్తులు వేయగలిగిన వాళ్లు ఎందుకు సైలెంట్ అయ్యారు? పార్టీ నేతలపైనే సొంతవాళ్లు ఆరోపణలు చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? వ్యూహం లేదు.. కాడి పడేశారు..! స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అధికారం డీసీసీలకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్. బలం లేకున్నా బరిలో నిలుచుని.. సమస్యలపై చర్చకు పెట్టాలని మెదక్, ఖమ్మం జిల్లాలో పోటీ చేసింది.…
కాంగ్రెస్ పోటీ చేసిన రెండు స్థానాల్లో మాకు ఉన్న ఓట్ల కంటె ఎక్కువే వచ్చాయి. కాబట్టి భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి విజయం సాధించారు అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ ఓట్లు మాకు వచ్చాయి అంటే.. టీఆర్ఎస్ పై వ్యతిరేకత కనిపిస్తుంది అన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా..నైతికంగా ఓడిపోయింది. నల్గొండలో అభ్యర్థిని పెట్టకపోయినా..ఇండిపెండెంట్ అభ్యర్థికి మా పార్టీ వారు ఓటేసారు. స్థానిక సంస్థల పట్ల టీఆర్ఎస్ వ్యతిరేక దోరణి..…
రేపు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ జెండా పండుగ జరుపుతున్నాం. రేపు అన్ని పోలింగ్ బూత్ స్థాయి లతో పార్టీ జెండా ఎగురేయాలని పీసీసీ నిర్ణయించింది అని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం తోపాటు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ 9. రేపు ఈ రెండు ప్రాధాన్యతలు కలిగిన రోజు కాబట్టి పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ ప్రారంభిస్తున్నాము. రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ పరిధిలోని పోలింగ్…
తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు గురించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ పై సోనియా గాంధీ ప్రకటన చేసిన రోజు డిసెంబర్ 9… అందుకే డిసెంబర్ 9 ఉదయం 10 గంటల నుండి సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నాము అని తెలిపారు. ఈసారి డిజిటల్ సభ్యత్వ నమోదు ఉంటుంది.కొల్లాపూర్ లో రేవంత్, మధిర లో సిఎల్పీ నేత భట్టి సభ్యత్వ నమోదులో పాల్గొంటారు. 30 లక్షల సభ్యత్వం లక్ష్యం గా పెట్టుకున్నాము. జనవరి 26…
తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే.. కాంగ్రెస్ పోటీ చేస్తోంది రెండు చోట్లే. మరి.. మిగిలిన నాలుగు స్థానాల్లో హస్తం వ్యూహం ఏంటి? పోటీకి దూరంగా ఉన్న జిల్లాల్లో ఎవరిపై గురి పెడుతోంది? లెట్స్ వాచ్..! ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఆరుచోట్లా క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. గెలిచే బలం ఉన్న పార్టీ సైతం ముందు జాగ్రత్త పడుతోంది. ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల…