Dhurandhar2 : ధురంధర్ 2’ ట్రైలర్ రిలీజ్ పై గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ధురంధర్ 2’ ఒకటి. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దేశభక్తి, యాక్షన్ అంశాలతో దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. చాలా రోజులుగా అభిమానులు ‘ధురంధర్ 2’ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజైనా ట్రైలర్ అప్‌డేట్ వస్తుందేమో అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
Also Read : KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్‌కు వరుస తలనొప్పులు
Also Read
అయితే ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు. దేశం మొత్తం ప్రశంసించిన దర్శకుడు ఆదిత్య ధర్ దగ్గరే ట్రైలర్ విషయంలో స్పష్టత లేకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ట్రైలర్ మాత్రమే కాదు, సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా ఇప్పటికీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చిత్ర బృందం ఈ విషయాన్ని పూర్తిగా సీక్రెట్ మిషన్ లాగా ఉంచుతున్నట్టు కనిపిస్తోంది.అయితే సినిమా మీద ఉన్న భారీ అంచనాల దృష్ట్యా, ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే అభిమానులు ఇప్పుడు ఒక్క అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈరోజైనా ‘ధురంధర్ 2’ ట్రైలర్ పై అధికారిక ప్రకటన వస్తుందా లేదా అనేది చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!