Shiva Karthikeyan: శివ కార్తికేయన్, అనుదీప్ సినిమా మొదలైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన యువ దర్శకుడు అనుదీప్ కె.వి.తో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తను దర్శకత్వం వహించిన ‘జాతి రత్నాలు’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిన తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకడిగా మారిపోయాడు అనుదీప్. ‘వరుణ్ డాక్టర్’ చిత్ర విజయంతో తెలుగువారికీ మరింత చేరువయ్యాడు హీరో శివ కార్తికేయన్. ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ తయారు చేసినట్టు అనుదీప్ తెలిపాడు. శివకార్తికేయన్ కు ల్యాండ్‌మార్క్ గా వుండే ఈ 20వ చిత్రం గురువారం ప్రారంభం కావడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టేసింది. సింగిల్ షెడ్యూల్ గా ఈ సినిమా కరైకుడి, పాండిచ్చేరిలో చిత్రీకరించబోతున్నారు. ప్రస్తుతం శివ కార్తికేయన్, సత్యరాజ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కథ యూకే లోని లండన్ నేపథ్యంలో జరుగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!