గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య టిక్కెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న విషయం తెల్సిందే,. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యను నెత్తిమీద వేసుకున్న మెగాస్టార్ పరిష్కార మార్గం కోసం ఏపీ సీఎం జగన్ ని భేటీ అయ్యి సమస్యలపై చర్చించారు. ఇక నేడు ఇండస్ట్రీ పెద్దలతో కలిసి మరోసారి భేటీ అయ్యారు. సమస్యలను వివరించాం.. పరిష్కారం త్వరలోనే దొరుకుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ భేటీకి మంచు ఫ్యామిలీ హాజరు కాకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన మంచు మోహన్ బాబు కానీ, మా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న మంచు విష్ణు కానీ ఈ మీటింగ్ హాజరుకాలేదు. మొన్నటికి మొన్న మోహన్ బాబు చిత్ర పరిశ్రమలోని సమస్యలను జగన్ తో మాట్లాడుతా అని బాహాటంగానే చెప్పారు. కానీ ఇప్పుడు పెద్దలతో పాటు ఆయన ఎందుకు రాలేదు అనేది ప్రశ్నగా మారింది. అయితే అందుతున్న సమాచారం బట్టి మోహన్ బాబు ఫ్యామిలీకి సీఎం నుంచి ఆహ్వానం అందలేదట.
సీఎంఓ నుంచి ఆహ్వానం అందినవారే ఈ భేటీలో పాల్గొన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయాన్నీ చిరు కూడా వెల్లడించారు. తనకు మాత్రమే సీఎంఓ నుంచి ఆహ్వానం అందిందని చెప్పుకొచ్చారు. అంటే ఈ లెక్కన ఇప్పుడు వెళ్లినవారికి మాత్రమే సీఎంఓ నుంచి ఆహ్వానం వెళ్లిందా..? మరి జగన్ కి దగ్గరివాడైన మోహన్ బాబుకు ఎందుకు ఆహ్వానం అందలేదు అనేది తెలియాల్సి ఉంది. ఒక్క మోహన్ బాబు మాత్రమే కాదు చాలామంది ఇండస్ట్రీ పెద్దలు ఈ మీటింగ్ కి గైర్హాజరు అయ్యారు. అంతా చిరంజీవి చూసుకుంటాడని వాళ్ళందరూ మౌనంగా ఉన్నారా..? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా..? అనేది తెలియాలి.