సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల పెద్దన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్ర సమయంలోనే తలైవా ఆరోగ్యం పాడవడం, ఆసుపత్రి పాలవ్వడం తిరిగి కోలుకోవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉంది. దీంతో ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక ప్రకటనను మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధిమారన్, రజినీకాంత్ 169 ను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పూజ కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలుపెట్టనున్నారట. ఇక ఈ క్రేజీ కాంబో ప్రకటనపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తలైవా ఈసారి థియేటర్లో రచ్చ మాములుగా ఉండదని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.