పోసాని కృష్ణ మురళి.. నోటికి ఏది వస్తే అది మాట్లాడి వివాదాలలో ఇరుక్కోవడం ఈయనకు కొత్తేమి కాదు. ఇక ఈ మధ్యన పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇంటి మీద దాడి చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు పోసాని అజ్ఞాతంలోకి వెళ్లిన పోసాని ఆ మధ్యన మా ఎలక్షన్స్ లో మెరిసి మళ్లీ కనుమరుగయ్యారు. ఇక పోసాని టాపిక్ ని అంటారు మర్చిపోతున్న సమయంలో నేడు ఏపీ సీఎం జగన్ మీటింగ్ లో ఆయన ప్రత్యేక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కూడా పోసాని నోటిదూకుడు తగ్గలేదని భోగట్టా. ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు నిలబడితే పోసాని మరో పక్క నిలబడి చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి శ్రీకారం చుట్టాయి. పరిశ్రమలోని సమస్యలను జగన్ కి వివరిస్తుండగా.. పోసాని హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
హీరోలు రెమ్యూనిరేషన్ తగ్గించుకుంటే .. సినిమా ఖర్చు కూడా తగ్గుతుందని, తీసుకోవడానికి కోట్లు కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటారు సమస్య వస్తే మాత్రం ఇంట్లో నుంచి కదిలారు అంటూ పోసాని ఘాటు వ్యాఖ్యలే చేసేరట. దీంతో పోసాని పై ఫైర్ అయిన ఇండస్ట్రీ పెద్దలు ఆయనను సమావేశం మధ్యలోనే బయటికి పంపినట్లు తెలుస్తోంది. అందుకే పోసాని ప్రెస్ మీట్ లో కనిపించలేదని సమాచారం. ఇక ఇదంతా పక్కన పెడితే.. అస్సలు పోసానిని, సీఎం జగన్ మీటింగ్ కి పిలవడానికి ఆయనకు ఉన్న అర్హత ఏంటి..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి పోసాని ఏ కేటగిరిలో హాజరయ్యారని మండిపడుతున్నారు.