కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి జంటగా నటిస్తున్న చిత్రం వాలిమై. హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 24 న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే తమిళ్ లో ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ .. తాజాగా తెలుగులో కూడా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ట్రైలర్ ని రిలీజ్ చేసి, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అర్జున్ గా అజిత్ కనిపిస్తుండగా.. హ్యాకర్ కింగ్ గా హీరో కార్తికేయ కనిపించాడు.
ట్రైలర్ ని మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఇందులోని బైక్ రేసింగ్ సీన్లలో అజిత్ డూప్ లేకుండా నటించడం విశేషం. ఇక ఎత్తుకు పై ఎత్తులతో అజిత్- కార్తికేయ మధ్య వచ్చే సన్నివేశాలకు థియేటర్లలో రచ్చ మాములుగా ఉండదని తెలుస్తోంది. ఇక అజిత్, కార్తికేయ లుక్స్, నటన ఆకట్టుకొంటుంది. ఇక యువన్ శంకర్ రాజా సంగీతం హైలైట్ గా నిలిచింది. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 24 న రిలీజ్ కి రెడీ అయ్యింది. మరి ఏ సినిమాతో అజిత్ తెలుగులో కూడా హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.
Intense and absolutely gripping! Wishing #AjithKumar and the entire team of #Valimai a massive success! 👍https://t.co/tUFOuQfx1y@BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @ActorKartikeya #NiravShah @humasqureshi @bani_j
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2022