మెగాస్టార్ చిరంజీవి హార్డ్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో కొణిదెల శివ శంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. రాత్రి, పగలు అని చూడకుండా సినిమానే ప్రాణంగా భావించి ఆయన కష్టపడ్డారు కాబట్టే నేడు మెగాస్టార్ గా కొలువుండిపోయారు. కొన్నిసార్లు ఆయన పడిన కష్టం ఆయన నోటివెంట వింటుంటే కళ్ళు చెమర్చక మానవు. ఇప్పుడున్న హీరోలు కొద్దిగా కాలు నొప్పి ఉంటేనే షూటింగ్ కు పదిరోజులు సెలవు…
ఏ రంగంలోనైనా వారసత్వం ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమలో వారసత్వం నుంచి వచ్చిన హీరోలే ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరి వారసులు టాలీవుడ్ ని ఏలుతున్నారు. ప్రస్తుతం అందరి చూపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడిపైనే ఉన్నాయి. పవన్, రేణు దేశాయ్ లకు పుట్టిన కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతనికి 18 ఏళ్లు. ఆరడుగుల ఆజానుబాహుడు.. సూదంటి…
తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలు అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా మరో విభిన్న చిత్రాన్ని ప్రకటించింది. ‘విట్ నెస్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బహుభాషా చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ బహుభాషా చిత్రానికి సంబంధించి మే డే శుభాకాంక్షలు తో విడుదల చేసిన ‘విట్ నెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ఏదో విపత్కర పరిస్థితిలో…
నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక ‘అఖండ’ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే డైరెక్టర్ కూడా ఊర…
అక్కినేని నాగార్జున గురించి చెప్పాలంటే నవ మన్మధుడు.. టాలీవుడ్ కింగ్.. 62 ఏళ్ల వయస్సులోనూ కుర్రహీరోలకు ధీటుగా ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలామంది హీరోలను నాగార్జున ఆదర్శమని చెప్పాలి. ఎప్పుడు పేస్ లో ఛార్మింగ్, గ్లో తో కనిపించే నాగ్ ఫేస్ కళతప్పింది. నాగ్ కొడుకు నాగ చైతన్య, సమంత విడాకుల తరువాత అక్కినేని ఫ్యామిలీ మీడియాకు దూరంగా ఉన్న విషయం విదితమే. ఇక ఆ తరువాత తమ సినిమాల ప్రమోషన్స్ లో…
అష్టాచమ్మా చిత్రంతో తెలుగుతెరకు నాని గా పరిచయమయ్యాడు నవీన్ బాబు ఘంటా. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి, అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి, అనుకోని ఒక పరిస్థితిలో నవీన్ నుంచి నాని గా మారాడు. ఇక తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆనతి కాలంలోనే న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పటికి నాని చాలా సార్లు ఈ విషయాన్ని చెప్తూనే ఉంటాడు. అష్టాచమ్మా కనుక జరగకపోయి ఉంటే తాను ఇప్పుడు, ఇక్కడ, ఇలా ఉండేవాడిని కాదు అని,…
మినిస్టర్ రోజా సెల్వమణి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి చిరు కుటుంబాన్ని పలకరించారు. మంత్రి రోజాను, చిరు కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. అనంతరం ఆమె మంత్రి పదవి అందుకున్నందుకు చిరు , రోజా దంపతులను సన్మానించారు. కొద్దిసేపు ఇరు కుటుంబాలు ముచ్చటించుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని తెలుపుతూ రోజా, చిరుతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో షేర్…
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం ఒక హిట్ కోసం ఆరాటపడుతున్నాడు. ఇటీవల గోపీచంద్ నటించిన సీటిమార్ ప్రేక్షకులను నిరాశపరిచిన విషయం విదితమే. ఇక దీంతో తన తదుపరి చిత్రంతో ఎలాగైనా విజయం అందుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం గోపిచంద్ తనకు రెండు విజయాలను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్న విషయం విదితమే. కొన్నిరోజుల క్రితం గోపీచంద్ 30 వ సినిమాగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ఇటీవలే మైసూర్ లో…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలే నడుస్తున్న విషయం విదితమే. వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. అయితే తాజాగా కొన్ని చిన్న సినిమాలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఇక ఆ కోవకే చెందుతుంది ‘ముత్తయ్య’ చిత్రం. కె. సుధాకరరెడ్డి కీలక పాత్రలో నటించి భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ముత్తయ్య’. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కేదార్ సెలగమ్శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ…
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ‘మిర్చి’ దగ్గర నుంచి ‘భరత్ అనే నేను’ వరకు కొరటాల అంటే మార్క్ అనేలా తెరక్కించాడు. ఇక ఆ లిస్ట్ లోనే ఆచార్య కూడా వెళ్తోంది.. అదే మార్క్ ను ఆచార్య లో చూపిస్తాడు అనుకున్న ప్రేక్షకులను కొరటాల నిరాశపరిచాడు అనేది టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన…