Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల రంగరంగ వైభవంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఈసారి కూడా నిరాశనే మిగిల్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం వైష్ణవ్ తన సినిమాలను ఆచితూచి ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాను వైష్ణవ్ ప్రకటించాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య సౌజన్య త్రివిక్రమ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సౌజన్య.. ఫొర్టీన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మిస్తున్న విషయం విదితమే.
ఇక వైష్ణవ్ విషయంలో సౌజన్య ఎంతో శ్రద్ద వహిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అతని లుక్ క్యాస్టూమ్స్ అన్నీ ఆమెనే దగ్గరుండి చూసుకొంటున్నదట. ఇక ఈ చిత్రంలో వైష్ణవ్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. భార్య నిర్మిస్తున్న సినిమా కాబట్టి త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడు. దీంతో కథలో దమ్ము ఉంటేనే ఓకే చేసి ఉంటాడని అంటున్నారు. అందుకే సౌజన్య.. వైష్ణవ్ ను విసిగించి మరీ లుక్ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నదట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ మెగా హీరో మరి తన నాలుగవ సినిమాతోనైనా ఆ విజయాన్ని కంటిన్యూ చేస్తాడా..? లేదా..? అనేది చూడాలి.